Site icon HashtagU Telugu

WhatsApp Update: వాట్సాప్ లో అడ్మిన్ అప్రూవల్ ఫీచర్.. 21 కొత్త ఎమోజీలు

Admin Approval Feature In WhatsApp.. 21 New Emojis

Admin Approval Feature In Whatsapp.. 21 New Emojis

మరొకొత్త వాట్సాప్ ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ గ్రూప్ చాట్‌ లో అడ్మిన్‌ల కోసం కొత్త అప్రూవల్ ఫీచర్‌ రాబోతోంది.దీని ద్వారా గ్రూప్ అడ్మిన్‌లు గ్రూప్ చాట్‌లో పాల్గొనేవారిని ఈజీగా నిర్వహించవచ్చు. అడ్మిన్ అప్రూవల్ ఫీచర్ ను ఆన్ చేస్తే.. ఎవరైనా కొత్తగా గ్రూప్‌లో చేరడానికి ముందు అడ్మిన్ నుంచి ఆమోదం పొందవలసి ఉంటుందనే మెసేజ్ కనిపిస్తుంది. iOS మరియు Android ఫోన్లలోని WhatsApp బీటా తాజా వర్షన్‌లో ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

వాట్సాప్ గ్రూప్‌లో ఎవరు చేరాలో నియంత్రించాలనుకునే నిర్వాహకులకు లేదా భారీ సంఖ్యలో పాల్గొనే పబ్లిక్ కమ్యూనిటీలకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.  వాట్సాప్ గ్రూప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి .. మీరు ‘కొత్త పార్టిసిపెంట్‌లను ఆమోదించు’ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఇది మీ ఫోన్ లో అందుబాటులోకి రావడానికి మీరు కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు.

Windows వెర్షన్ కోసం కాల్ లింక్ ఫీచర్‌:

ఈ నెల ప్రారంభంలో వాట్సాప్  Android టాబ్లెట్‌లలో కొత్త స్ప్లిట్ వ్యూ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేసింది. వాట్సాప్  Windows వెర్షన్ కోసం కాల్ లింక్ ఫీచర్‌ను తెచ్చింది.  WhatsApp Windows బీటా వర్షన్ లో సందేశాల కోసం కొత్త “మల్టీ-సెలక్షన్” ఫీచర్‌ను కూడా వాట్సాప్ విడుదల చేస్తోంది. దీని ద్వారా బీటా టెస్టర్‌లు ఇప్పుడు సంభాషణలో బహుళ సందేశాలను ఏక కాలంలో ఎంచుకోవచ్చు. Windows కోసం  వాట్సాప్‌లో అన్నింటినీ ఒకేసారి తొలగించడానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి ఎంచుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న విండోస్ 2.2309.2.0 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత బీటా టెస్టర్‌లకు బహుళ సందేశాలను ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ ఫీచర్ రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందించ బడుతుందని ఒక నివేదిక పేర్కొంది.

21 కొత్త ఎమోజీలు:

తాజాగా వాట్సాప్‌ నుంచి మరో అప్‌టేడ్‌ వచ్చింది. మెటా యాజమాన్యంలోని ఈ కంపెనీ 21 కొత్త ఎమోజీలను లాంచ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతోపాటు చిన్న చిన్న మార్పులతో 8 ఎమోజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్‌ వాట్సాప్‌ బీటా ఇన్‌స్టాల్‌ చేసుకున్న బీటా టెస్టర్‌లకు కొత్త ఎమోజీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి దశల వారీగా మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. వాట్సాప్‌ ట్రాకర్ WABetaInfo ఈ వివరాలు వెల్లడించింది.

‘మేము ఇంతకుముందే యూనికోడ్ 15.0 నుంచి 8 ట్వీక్డ్ ఎమోజీలు, 21 కొత్త ఎమోజీల గురించి సమాచారాన్ని షేర్‌ చేశాం. 21 కొత్త ఎమోజీలు డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉండటంతో కీబోర్డ్‌లో కనిపించలేదు. ఆల్టర్నేటివ్ కీబోర్డ్‌ని ఉపయోగించి వాటిని సెండ్‌ చేయవచ్చని తెలిపాం. అయితే ఇప్పుడు బీటా టెస్టర్‌ల కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ (Google Play Store) లో ఆండ్రాయిడ్‌ 2.23.5.13 వెర్షన్‌ని ఆండ్రాయిడ్‌ బీటా అందుబాటులో ఉంది. ఇందులో అఫిషియల్‌ వాట్సాప్‌ కీబోర్డ్‌లో బీటా టెస్టర్‌లు కొత్త ఎమోజీలను చూడవచ్చు.’ అని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.

Also Read:  Big Loan Deal: రిలయన్స్ కు రూ.24,600 కోట్ల లోన్ ఇచ్చేందుకు 10 బ్యాంకులు రెడీ

Exit mobile version