భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాకుమెంట్ గా మారిపోయింది. ప్రతి చిన్న పెద్ద దానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక అలాంటి ఆధార్ కార్డులు ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే సరి చేసుకోవడం అన్నది తప్పనిసరి. అది సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం ప్రభుత్వం ఏకంగా 13,352 ఆధార్ నమోదు అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడంలో ప్రజలు నిరంతరం సమస్యలను ఎదుర్కొంటున్నందున సమస్య నుండి బయటపడేందుకు పోస్టాఫీసులలో కూడా ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చని ఇండియా పోస్ట్ తన ట్విట్టర్ సైట్‌లో పోస్ట్ చేసింది. ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు ప్రజలు పెద్ద క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టల్ శాఖ కూడా ఆధార్ సంబంధిత సేవలను అందించడం ప్రారంభించిందని తపాలా శాఖ వెబ్‌సైట్‌లో తాజాగా పేర్కొంది. కాగా పోస్టాఫీసులలో రెండు రకాల ఆధార్ నమోదు, అప్‌డేట్ సేవలను అందుబాటులో ఉంటాయి.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లో వ్యక్తుల బయోమెట్రిక్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ గా నమోదు చేయడం ద్వారా ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. అలాగే ఆధార్ అప్‌డేట్ లో ఎవరైనా తమ పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, ఫోటో, ఐరిస్ ఏదైనా పొరపాటు లేదా గడువు ముగిసినట్లయితే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సేవ భారతదేశంలోని 13,352 కేంద్రాలలో అందుబాటులో ఉంది. ఈ సేవ కోసం ఏ తపాలా కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి https://www.indiapost.gov.in/ లో ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయాలి. గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలతో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ ను అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సిఫార్సు చేస్తోంది. ఆధార్ సంబంధిత స్కామ్ లను నివారించడానికి గత 10 సంవత్సరాలుగా తమ వివరాలను అప్‌డేట్ చేయాలని ఆధార్ హోల్డర్ లను కోరుతోంది. మరిన్ని వివరాల కోసం పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.