Site icon HashtagU Telugu

Aadhaar Update: ఆధార్ లో అడ్రెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆన్ లైన్ లో మార్చుకోండిలా!

Aadhaar Update

Aadhaar Update

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రతీ చిన్న పనికీ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు సంబంధించి అన్నింటికి కోసం ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. అయితే ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉన్న ప్రతి వ్యక్తికీ ఆధార్ కార్డు తప్పకుండా ఉండాల్సిందే. కాగా ఆధార్ కార్డు లేకుండా చాలా పనులు చేయడం అసాధ్యం. ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం కాబట్టి, ఆధార్‌ లోని వివరాలు సరైనవి కావడం ముఖ్యం. మీ ఆధార్‌ లో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే, వెంటనే దాన్ని సరిదిద్దడం చాలా ముఖ్యం. అయితే ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారినట్లయితే, అతను దానిని ఆధార్ కార్డులో అప్‌డేట్ చేయాలి.

మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతున్నట్లయితే, మీరు తప్పనిసరిగా చిరునామాను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటి అడ్రస్‌ను మార్చాల్సి ఉంటుంది. అయితే మీరు దీనిని ఇంటి నుండి చేయవచ్చు. ఇందుకోసం కొత్తగా మారిన ఇంటి కరెంటు బిల్లు ఒక్కటే ఉంటే చాలు. అయితే మరి ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాను ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా మీరు UIDAI యొక్క మై ఆధార్ వెబ్‌సైట్‌ కి వెళ్లాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌ ను రిజిస్టర్ చేసి, సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆపై మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, లాగిన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు వెబ్‌లో కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

దాని కింద అడ్రస్ అప్‌డేట్‌ పై క్లిక్ చేసి, ఆపై అప్‌డేట్ ఆధార్‌ పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త పేజీ కనిపిస్తుంది. అందులోని సమాచారాన్ని వెరిఫై చేసి, ఆపై ఆధార్ అప్‌డేట్ ప్రాసెస్‌ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత ప్రస్తుత అడ్రస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ తర్వాత దాని కింద కనిపించే Details to be updated అనే విభాగంలో మీరు మార్చాలనుకుంటున్న వివరాలను ఎంటర్ చేయాలి. పూర్తి చిరునామాను అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు చిరునామా రుజువుగా విద్యుత్ బిల్లును అప్‌డేట్ చేయాలి. దీనికి రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.