M Aadhaar: ఇకపై క్షణాల్లోనే మీ స్మార్ట్ ఫోన్ లో ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్.. పూర్తి వివరాలివే?

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఇలా ఏ దానికి అయినా సరే ఆధార్ కార్డు ఉం

  • Written By:
  • Publish Date - January 15, 2024 / 03:30 PM IST

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఇలా ఏ దానికి అయినా సరే ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలా ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. అయితే అటువంటి ఆధార్ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి.కాగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను సింపుల్‌గా ఫోన్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు. అలాగే ఆధార్‌ ఒరిజినల్‌లా ధ్రువీకరించుకోవచ్చట. ఆధార్‌ను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎం-ఆధార్‌ను తీసుకొచ్చింది. ఇది ఆధార్ కార్డునకు మొబైల్ యాప్ వెర్షన్‌ను సూచిస్తుంది.

ఇది తప్పనిసరిగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ ఆధార్ సమాచారాన్ని డిజిటల్‌గా తీసుకెళ్లడానికి, వివిధ ఆధార్ సంబంధిత సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మరి ఎం ఆధార్ ఫీచర్స్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎం ఆధార్‌ ద్వారా మీ వ్యకతిగత సమాచారం, ఫోటోగ్రాఫ్, ఆధార్ నంబర్‌ను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు మొదలైన వాటి వద్ద ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ కోసం మీ ఫోన్‌ని ఉపయోగించవచ్చు. ఎం ఆధార్‌ యాప్‌ దవ​ఆరా మీ ఆధార్ కార్డునకు సంబంధించిన సురక్షితమైన, డిజిటల్ సంతకం చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అలాగే ఈ యాప్‌లో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఐదుగురి ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే ఆఫ్‌లైన్ ఆధార్ ప్రమాణీకరణ కోసం తాత్కాలిక పిన్‌ను సృష్టించవచ్చు. ఎం ఆధార్‌ యాప్‌ ద్వారా నిర్వహించే మీ అన్ని ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ లావాదేవీలను ట్రాక్ చేయాలి. మరి ఎం ఆధార్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేయడం ఎలా అన్న విషయానికి వస్తే.. ఎం ఆధార్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ లేదా ఐఓఎస్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్‌ని తెరిచి రిజిస్టర్ ఆధార్ ఆప్షన్ ను ఎంపికను ఎంచుకోవాలి. మీ చెల్లుబాటు అయ్యే 12-అంకెల ఆధార్ నంబర్, అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఎం ఆధార్‌ ప్రొఫైల్‌కు సురక్షితమైన యాక్సెస్ కోసం 4 అంకెల పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. అనంతరం మీ ఆధార్‌తో లింక్ చేసిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటీపీను నమోదు చేయాలి. ఒకసారి ఆధార్‌ నమోదు చేసుకున్న తర్వాత మీరు సృష్టించిన పిన్ లేదా పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మీ ఎం-ఆధార్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయవచ్చు.