Aadhaar: ఆధార్ కార్డ్ అప్డేట్ చేయిస్తున్నారా.. అయితే ఈ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే?

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 04:15 PM IST

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే నేటి రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. బ్యాంకు అకౌంట్,పాన్ కార్డ్ వంటి సేవలతో పాటుగా ప్రభుత్వ ప్రైవేటు పథకాలకు కూడా ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. దాంతో ఆధార్ కార్డు అన్నది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారిపోయింది. అయితే మరి అలాంటి ఆధార్ కార్డులో పేరు, డేటాఫ్ బర్త్,జెండర్, ఇంటి అడ్రస్ ఇలా ప్రతి ఒకటి కూడా కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ అందులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి.

అయితే వీటిని అప్డేట్ చేసే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు రూల్స్ ని పాటించడం తప్పనిసరి. ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ అలాగే జెండర్ సహా ఇతర అప్ డేట్స్ చేసే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, అడ్రస్, జెండర్ లాంటి వివరాలను ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు అనే దానిపై ఒక లిమిట్ ఇచ్చారు. ఆధార్ కార్డు వివరాలను ఎన్నిసార్లు అప్‌డేట్ చేయొచ్చన్న విషయాన్ని చెబుతూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని పరిమితులు, షరతులను పెట్టింది. ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎక్కువ సార్లు మార్చుకోవడానికి వీలు లేదు.

ఆధార్‌ కార్డ్ హోల్డర్‌ తన జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆధార్‌ కార్డులో మార్పులను రెండుసార్లే అప్‌డేట్ చేయవచ్చు. మూడోసారి పేరు మార్చాలనుకుంటే ప్రత్యేక అభ్యర్థన చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఆధార్‌ కార్డులో జెండర్ ను కూడా ఒకసారి మాత్రమే మార్చుకునే వీలుంది. కాబట్టి ఆధార్‌ కార్డు అప్ డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అదేవిధంగా ఆధార్ కార్డు సమస్యల పరిష్కారం కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది. UIDAI ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ తీసుకొచ్చింది. ఈ హెల్ప్ లైన్ నంబర్ 1947. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. ఈ నంబర్‌కు కాల్ చేసి మీ అనుమానాలు అన్నీ 1947 నంబర్‌కు కాల్ చేస్తే UIDAI ప్రతినిధులు మీతో మాట్లాడుతారు. ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, మరాఠీ మొత్తం 12 భాషల్లో UIDAI ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు. ఈ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు, అదేవిధంగా ఆదివారం రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఆధార్ కార్డు డాక్యుమెంట్లలో ఏదైనా అప్‌డేట్ చేయాలంటే Myaadhaar వెబ్‌సైట్‌లో ఫ్రీగా చేసుకోవచ్చు. పలుమార్లు ఈ గడువు పొడిగించి చివరకు డిసెంబర్ 14 లాస్ట్ డేట్ ఇచ్చారు. అదేవిధంగా ఆధార్ కార్డు సమస్యలను emailhelp@uidai.gov.in కు మెయిల్ చేసి పరిష్కారం తెలుసుకోవచ్చు.