Site icon HashtagU Telugu

Aadhaar Card: సులభంగా సింపుల్ పద్ధతిలో ఆధార్ కార్డ్ లో మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోండిలా!

Aadhaar Card

Aadhaar Card

మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేయాలని అనుకుంటున్నారా? అలాగే మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబరు లింక్ అయిందో తెలియదా? ఫోన్ నెంబర్ ను మార్చాలి అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా ఈ అవాంతరాలను నివారించడానికి తమ ఆధార్ కార్డ్ నంబర్‌ ను జాగ్రత్తగా అప్‌డేట్ చేయాలి. ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ, వినియోగదారులు తమ ఇళ్లలో ఉండే తమ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవచ్చట. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి? అన్న విషయానికి వస్తే.. అయితే ఇందుకోసం ముందుగా అధికారిక UIDAI వెబ్‌సైట్ కి వెళ్లి www.uidai.gov.in వెబ్‌సైట్ విజిట్ చేయాలి. తర్వాత హోమ్‌ పేజీలో గెట్ ఆధార్ పై క్లిక్ చేసి బుక్ అపాయింట్మెంట్ కి వెళ్ళాలి. తర్వాత కొత్త పేజీలో మీ నగరం పేరును ఎంటర్ చేయండి లేదా జాబితా చేయకపోతే అదర్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌ ను ఎంటర్ చేసి, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఓటీపీ జనరేట్ బటన్‌పై ట్యాప్ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆపై మీరు మీ ఆధార్ నంబర్, పూర్తి పేరు, అప్లికేషన్ వెరిఫికేషన్ టైప్, సిటీ, ఎంటర్ చేసి, ఆధార్ సర్వీసు సెంటర్ ఎంచుకోవాల్సిన కొత్త పేజీ కనిపిస్తుంది. సర్వీసును ఎంచుకోండి కింద అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. అపాయింట్‌మెంట్ బుక్ చేసేందుకు ఆధార్ సర్వీసు సెంటర్ సందర్శించాలి. ఫారమ్‌ ను సమర్పించడానికి తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి.

అపాయింట్‌మెంట్‌ ను పూర్తి చేయడానికి, వినియోగదారులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత వినియోగదారులకు అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (URN) ఉన్న రసీదు స్లిప్ అందుకుంటారు. అప్‌డేట్‌ ల స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ నంబర్‌ ని ఉపయోగించవచ్చు.
అన్ని ఆన్‌లైన్ ప్రాసెస్, విజిట్ చేసిన తర్వాత, యూఐడీఏఐ బృందం అప్‌డేట్‌ పై పనిచేస్తుంది. ఈ ప్రక్రియకు 90 రోజులు పట్టవచ్చు. వినియోగదారులు యూఐడీఏఐ టోల్ ఫ్రీ నంబర్ 1947ను ట్రాక్ చేయడానికి లేదా కాల్ చేయడానికి (URN)ని ఉపయోగించవచ్చు. బ్యాంకింగ్ సమయంలో లేదా ఏదైనా ప్రభుత్వ ప్రక్రియ సమయంలో ఎలాంటి అవాంతరాలను నివారించడానికి ఆధార్ కార్డ్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.