భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఏడాది వయసు పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక ఈ రోజుల్లో ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ఇది కేవలం వ్యక్తిగత గుర్తింపు కార్డు మాత్రమే కాదు. స్కూల్,కాలేజెస్, ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ ఇలా ప్రతి ఒక్క దానికి ఆధార కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆధార్ కార్డు లేకుండా చాలా వరకు పనులు చేయడం అసాధ్యం అని చెప్పవచ్చు. అయితే మనం చిన్నప్పుడు ఎప్పుడో చేపించిన ఆధార్ కార్డు ని అలాగే అప్డేట్ చేయించకుండా చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు.
కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని చెబుతున్నారు. మరి ఆధార్ కార్డును ఎందుకు అప్డేట్ చేయాలి? దాని వల్ల ఏం లాభమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును రెన్యూవల్ చేసుకోవాలట. ఆధార్ కార్డ్ లోని పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాలని UIDAI సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే ఈ సమాచారం మారవచ్చు. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా మీరు ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ సేవలను పొందడం కొనసాగించవచ్చట. ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం వల్ల మోసం, నేర సంఘటనలను నివారించవచ్చని చెబుతున్నారు.
అలాగ ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం వల్ల బ్యాంక్ ఖాతా తెరవడం లేదా లోన్ కోసం దరఖాస్తు చేయడం వంటి ఆర్థిక సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు. మరి ఈ ఆధార్ కార్డును ఆన్లైన్ లో ఏ విధంగా అప్డేట్ చేయాలి అన్న విషయానికి వస్తే.. అయితే ఇందుకోసం ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/en/ సందర్శించి ఆధార్ నంబర్ తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దీని తర్వాత, UIDAI వెబ్‌సైట్ లో కనిపించే పేజీలో, చిరునామా అప్‌డేట్ పై క్లిక్ చేసి, ఆపై అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు అప్‌డేట్ చేయాల్సిన సమాచారాన్ని నమోదు చేసి ప్రాసెస్ టు అప్‌డేట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.
పై విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు ఆధార్ కార్డును సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.