NRI Aadhaar: ఎన్‌ఆర్‌ఐలు కూడా ఆధార్ కార్డును పొందవచ్చా.. దరఖాస్తు ఎలా చేయాలంటే?

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాకుమెంట్ లలో ఒకటిగా మారిపోయింది. ప్రభుత్వం కి అలాగే ప్రైవేట్

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 06:20 PM IST

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాకుమెంట్ లలో ఒకటిగా మారిపోయింది. ప్రభుత్వం కి అలాగే ప్రైవేట్ కి సంబందించిన ఎటువంటి పనులకు అయిన ఆధార్ అన్నది తప్పనిసరిగా మారింది. అయితే ఇతర డాకుమెంట్ లతో పోల్చుకుంటే ఆధార్ కార్డ్ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక వ్యక్తిగత వివరాలతో పాటు, పౌరుడి బయోమెట్రిక్ సమాచారం కూడా ఆధార్ లో నమోదు చేయబడుతుంది. భారత్ లో ప్రతి ముఖ్యమైన పనిని పరిష్కరించేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. కాగా ఎన్నారైలు కూడా ఆధార్ కార్డులను తయారు చేసుకోవచ్చు.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఆధార్ కార్డులను తయారు చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే గతంలో ఎన్నారైల ఆధార్ కార్డు తీసుకోవడానికి మొత్తం 182 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఉన్న నిబంధనల మార్పు తర్వాత త్వరగా పొందేందుకు ఆస్కారం ఉంటుంది. సాధారణ సమయంలోనే ఎన్‌ఆర్‌ఐలు ఆధార్‌ కార్డును పొందవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఎన్‌ఆర్‌ఐని నాన్-రెసిడెంట్ ఇండియన్‌గా చేయడానికి కొన్ని పత్రాలు అవసరమై ఉంటాయి.

భారతదేశంలో తయారు చేయబడిన ఆధార్ కార్డ్‌ని పొందాలనుకునే ఎన్‌ఆర్‌ఐలు తప్పనిసరిగా భారతదేశం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. మరి ఎన్ఆర్ఐ లు ఆధార్ కార్డు కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట ఎన్ఆర్ఐ ఆధార్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.. అయితే ఈ ఫారం సాధారణ ఆధార్ ఫారానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అలాగే దీంతోపాటుగా మీరు మీ చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌ పోర్ట్‌ను కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ఫారమ్‌ లో అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత మీరు మీ ఇ-మెయిల్ ఐడిని పూరించాలి. ఆ తరువాత మీరు పాస్‌ పోర్ట్ కాపీని మాత్రమే ఐడీ రుజువుగా జోడించాలి. ఆ తర్వాత మీరు ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ వివరాలను సమర్పించి,ఆధార్ సెంటర్‌లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ నంబర్ 14 ఉండవచ్చు పొందవచ్చు. ఆ తరువాత కొన్ని రోజుల్లో, మీ భారతదేశ చిరునామాకు ఆధార్‌ కార్డు వస్తుంది.