Masked Aadhaar: మాస్క్‌డ్ ఆధార్ తో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. డౌన్లోడ్ కూడా ఈజీ?

భారతదేశ పౌరులకు ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. అందుకే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Mixcollage 11 Jul 2024 10 03 Am 418

Mixcollage 11 Jul 2024 10 03 Am 418

భారతదేశ పౌరులకు ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. అందుకే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఆధార్ కార్డు ద్వారానే మోసాలకు స్కాములకు పాల్పడి అమాయకమైన ప్రజలను ఆసరాగా చేసుకుని కోట్లకు కోట్లు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి స్కామ్‌ల కేసులు పెరిగిన కారణంగా భారత ప్రభుత్వం ప్రకటనలు, సందేశాల ద్వారా పౌరులను హెచ్చరిస్తుంది.

అలాగే పౌరులకు భద్రతను కల్పించేందుక భారత ప్రభుత్వం మాస్క్డ్ ఆధార్ కార్డ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. మాస్క్‌డ్ ఆధార్ కార్డ్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఇంతకీ ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి దీని వల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుంది? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణ ఆధార్ కార్డుకు ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డు కాస్త భిన్నంగా ఉండడంతో పాటు డేటాను మరింత సురక్షితంగా ఉంచుతుందట. ఆధార్ కార్డ్‌లో 12 అంకెల సంఖ్యలు ముద్రించి ఉంటాయి. కానీ మాస్క్‌డ్ ఆధార్‌ లో చివరి 4 సంఖ్యలు మాత్రమే కనిపిస్తాయట. మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ ఐడీలో ఆధార్ కార్డ్‌లోని మొదటి 8 ఆధార్ నంబర్‌లు XXXX-XXXX అని ఉంటాయట.

అందువల్ల అపరిచిత వ్యక్తులకు ఆధార్ కార్డ్ నంబర్ తెలియదు. అలాగే ఇది మోసాలను నిరోధించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే మాస్క్‌డ్ ఆధార్ కార్డు పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. ఈ విషయాన్ని యూఐడీఏఐ స్పష్టం చేసింది. సాధారణ ఆధార్ కార్డ్ స్థానంలో మాస్క్‌డ్ ఆధార్‌ ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఎక్కడైన అడ్రస్ ప్రూఫ్ లేదా ఇతర అవసరాలకు ఆధార్ జిరాక్స్ ఇచ్చే సమయంలో మాస్క్‌డ్ ఆధార్ ఇవ్వడం వల్ల సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చుట. ఇంతకీ ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం ముందుగా యూఏడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో లాగిన్ ఎంపికపై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నంబర్ క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు సేవల విభాగం నుంచి డౌన్‌లోడ్ ఆధార్‌ను ఎంచుకోవాలి.మీ డెమోగ్రాఫిక్ డేటాను సమీక్షించండి అనే విభాగంలో మాస్క్డ్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
రివ్యూ తర్వాత మాస్క్ చేసిన ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ అవుతుంది.

  Last Updated: 11 Jul 2024, 10:03 AM IST