Aadhaar : మీ ఆధార్ ను లాక్ చేసుకోలేదా..? అయితే మీ డబ్బులు కొట్టేస్తారు జాగ్రత్త..

వివిధ మార్గాల ద్వారా వేలి ముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగిపోయాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవడం ఉత్తమం

Published By: HashtagU Telugu Desk
Payments Through Aadhaar

Aadhar

ప్రపంచ వ్యాప్తంగా టెక్నలాజి (Technology) రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని సంతోషపడాలో..లేక టెక్నలాజి పుణ్యమా అని మోసాలు పెరిగిపోతున్నాయని బాధపడాలో అర్ధం కానీ పరిస్థితి. టెక్నలాజి ని వాడుకొని చాలామంది నేరాలకు , ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మనకు తెలియకుండా మా బ్యాంకు అకౌంట్ (Bank Account Money WithDraw) నుండి డబ్బులు కొట్టేస్తున్నారు. మొన్నటి వరకు ఫోన్లు చేసి మీకు ఆ ఆఫర్ వచ్చిందని , లాటరీ తగిలిందని చెప్పి ఓటీపీ నెం లు అడిగి అకౌంట్ నుండి డబ్బులు కొట్టేసేవాళ్ళు. ఇంకొంతమందైతే కోటి రూపాయిలు వచ్చాయి..అందుకు గాను టాక్స్ కింద మీరు కొంత డబ్బు కట్టాలని అందుకు ఓ అకౌంట్ నెం చెప్పి..డబ్బులు కొట్టేసేవాళ్ళు..కానీ ఇప్పుడు చాలామంది ATM కార్డు వాడకుండా ఆధార్ కార్డు ద్వారా ఆధార్ బయోమెట్రిక్ (Aadhaar biometric) ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. దీనిని కొంతమంది నేరగాళ్లు క్యాష్ చేసుకుంటూ ఖాతాదారుడికి తెలియకుండానే అతడి ఆధార్ కార్డు ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాల జరుగుతున్నాయి. అందుకే మీరు తక్షణమే మీ ఆధార్ కార్డు ను లాక్ చేసుకోవాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఆధార్ కార్డు (Aadhaar Card) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత ప్రాముఖ్యమైంది. సగటు మనిషి ఏం చేయాలన్న..ఏం తీసుకోవాలన్న ఆధార్ అనేది తప్పనిసరి అయ్యింది. కొత్త సిమ్ తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా ఆధార్ అనేది ఉండాల్సిందే. దాంతో పాటు వేలి ముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే, ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తుంటారు. వీటినే అదునుగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా వేలి ముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగిపోయాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవడం ఉత్తమం. కావాల్సినప్పుపుడు అన్‌లాక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ ప్రమేయం లేకుండా బయో మెట్రిక్ వివరాలను ఇతరులు వినియోగించేందుకు వీలుపడదు. అయితే, ఆధార్ లాక్, అన్‌లాక్ ఆన్‌లైన్ ద్వారా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

  • ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసేందుకు ముందుగా మైఆధార్ పోర్టల్‌లో ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి.
  • హోమ్ పేజీలో లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అందులో లాక్, అన్‌లాక్ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపంచే నెక్ట్స్ బటన్ నొక్కాలి.
  • ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. కింద ఉన్న టర్మ్ బాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి.
  • మీ బయోమెట్రిక్ లాక్ అయినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంతే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయిపోతుంది. లాక్ అవ్వగానే లాక్, అన్‌లాక్ ఆప్షన్‌లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది.

ఆధార్ బయోమెట్రిక్ అన్‌లాక్ ఎలా చేయాలి?

  • మై ఆధార్ పోర్టల్‌లోకి లాగిన్ కాగానే లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది. ఇలా ఉంటే మీ బయోమెట్రిక్ లాక్ అయిందని అర్థం.
  • అన్‌లాక్ కోసం పైన చెప్పిన పద్ధతినే ఫాలో కావాలి.
  • అందులో ప్లీజ్ సెలెక్ట్ టూ అన్‌లాక్ టర్మ్ బాక్స్‌లో టిక్ చేయగానే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీ బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • ఆ తర్వాత నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ ఆధార్ బయోమెట్రిక్ అన్‌లాక్ అయినట్లు స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది.

ఇలా చేయడం వల్ల మీ ఆధార్ ద్వారా డబ్బులు వేరే వారు కొట్టేసే ఛాన్స్ ఉండదు. సో వెంటనే మీ ఆధార్ ను లాక్ చెయ్యండి.

  Last Updated: 01 Nov 2023, 11:25 AM IST