Phone Switched Off: మీ ఫోన్ పోయిందా.. అయితే ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగలించిన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయవచ్చట?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగ

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 03:45 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు మన అజాగ్రత్త వల్ల మన స్మార్ట్ ఫోన్లు పోవడం, దొంగలించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో చాలామంది ఫోన్ పోయిందని బాధపడటం తప్ప చేసేది ఏమీ లేక దిగులు చెందుతూ ఉంటారు. అయితే అలా ఫోన్ దొంగిలించినప్పుడు కొన్ని కొన్ని సార్లు మన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది. అయితే ఎవరైనా ఫోన్ దొంగలించగానే వెంటనే ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తారు.

కొన్ని రోజుల పాటు స్విచ్ ఆఫ్ చేసి తర్వాత సిమ్ ను మార్చడం, తదితర పనులు చేస్తుంటారు. అయితే మొబైల్లో ఈ చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో దొంగలించిన ఫోన్ ని ఎక్కడున్నా ట్రేస్ చేయవచ్చు. అయితే అందుకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ దొంగలించబడితే దొంగలు ముందుగా మొబైలు స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. దీంతో ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం. అయితే ఒక ట్రిక్ ద్వారా అసలు మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ కాకుండా చేయవచ్చు. అందుకోసం ముందుగా మొబైల్ లోని సెట్టింగ్స్ ని మార్చుకోవాలి అయితే ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ లోకి వెళ్ళాలి.

ఇక్కడ సిస్టం సెక్యూరిటీ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనిపై క్లిక్ చేయాలి ఇప్పుడు రిక్వైర్డ్ పాస్వర్డ్ పవర్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. దీనిపై ఉన్న ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ను కూడా ఆన్ చేయాలి. దీంతో మీరు అనుకున్న సెట్టింగ్స్ కంప్లీట్ అవుతోంది. ఈ సెట్టింగ్స్ మార్చుకున్న తర్వాత ఫోను ఎవరు దొంగలించినా కూడా దానిని స్విచ్ ఆఫ్ చేయలేరు. ఆ సమయంలో వారికి పాస్వర్డ్ అడుగుతుంది. అందువల్ల ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవడం వలన ఫోన్ ఎక్కడుందో వెంటనే ట్రేస్ చేయవచ్చు. తర్వాత దొంగను వెంటనే పట్టుకోవచ్చు. మొబైల్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.