Site icon HashtagU Telugu

Apple: ఇకపై ఫోన్ నుంచే ఎయిర్ పాడ్స్, వాచ్ లకు చార్జింగ్.. అదెలా అంటే?

Apple

Apple

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను పరిచయం చేస్తుండగా ఇంకొన్ని కంపెనీలు ఆల్రెడీ మార్కెట్లోకి విడుదల చేసిన వస్తువులలో మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పని చేయాలి అంటే దానికి చార్జింగ్ తప్పనిసరి. కాగా ఇందుకోసం చార్జర్లు, ఫాస్ట్ చార్జర్లు, పవర్ బ్యాంక్ లాంటివి మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పుడు వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీ మార్కెట్‌లోకి తీసుకురానుంది. తాజాగా యాపిల్ సంస్థ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకురాబోతోంది.

ఒక బ్యాటరీ నుంచి మరో బ్యాటరీని చార్జ్ చేసేలా దీనిని రూపొందిస్తోంది. అది కూడా పూర్తి వైర్ లెస్. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాపిల్ సంస్థ కొన్నేళ్లుగా రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు యాపిల్ సంస్థ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ తాజాగా 9 టు5 మ్యాక్ నివేదిక ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాపిల్ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో త్వరలో వచ్చే కొత్త మోడల్ ఐ ఫోన్ మోడల్ లో ఈ ఫీచర్ ను చూడవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే చాలామందికి రివర్స్ వైర్లెస్ చార్జింగ్ అంటే ఏమిటి అన్నది తెలియదు…

రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ అంటే ఒక డివైజ్ బ్యాటరీ నుంచి నుంచి ఇతర డివైజ్ ల బ్యాటరీలను చార్జ్ చేయడం. ఎటువంటి వైర్ కనెక్షన్లు లేకుండా పూర్తి వైర్ లెస్ తో ఇది సాధ్యమవుతుంది. యాపిల్ ఐ ఫోన్ వెనుక వైపు వైర్ లెస్ చార్జింగ్ ప్యాడ్ ఒకటి ఉంటుంది. ఇది యాపిల్ ఫోన్ బ్యాటరీలో ఉన్న సామర్థ్యాన్ని కొంత మేరకు యాపిల్ ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచ్ వంటి వాటి బ్యాటరీలకు అందిస్తుంది. ఐ ఫోన్ ఫాస్ట్ చార్జర్ ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకుంటూ ఫోన్ వెనుకవైపు ఉన్న ప్యాడ్ ద్వారా ఇతర డివైజ్ లను కూడా ఒకేసారి చార్జ్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.