Kerala : ఐఫోన్ 14 ప్రో పిచ్చి…ఫోన్ కొనేందుకు ఇండియా నుంచి దుబాయ్ వెళ్లాడు.!! ఎంత ఖర్చు చేశాడో తెలుసా..?

ఆపిల్ ఫోన్ అంటే చాలా మంది అదొరకమైన పిచ్చి. ఎలాగైనా సరే ఐఫోన్ వాడాల్సిందే. ఎంత ఖర్చయినా సరే పెట్టాల్సిందే.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 11:19 AM IST

ఆపిల్ ఫోన్ అంటే చాలా మంది అదొరకమైన పిచ్చి. ఎలాగైనా సరే ఐఫోన్ వాడాల్సిందే. ఎంత ఖర్చయినా సరే పెట్టాల్సిందే. ఇలాంటి వాళ్లను మనలో చాలామందిని చూస్తుంటాం. అచ్చం ఇలాగే కేరళాకు చెందిన ఓ వ్యక్తికి ఐఫోన్ అంటే పిచ్చి. ఈ మధ్యే రిలీజ్ అయిన ఐఫోన్ 14ప్రోను దేశంలో అందరికంటే ముందు తానే కొనుగోలు చేయాలని ఏకంగా దుబాయ్ ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ టిక్కెట్లు 40వేలు పెట్టి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ప్రీమియం రీసెల్లర్ మిర్డిఫ్ సిటీ సెంటర్ ముందు క్యూలో నిల్చుండి మరీ ఐఫోన్ను కొనుగోలు చేశాడు. అయితే ఈఫోన్ భారత్ లో సెప్టెంబర్ 16నుంచి అమ్మకాలను ప్రారంభించింది. అంతకంటే ముందే తాను కొనుగోలు చేయాలన్న క్రేజ్ అతన్ని దుబాయ్ వరకు తీసుకెళ్లాల చేసింది.

కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యాపారవేత్త ధీరజ్ పల్లియిల్ దేశంలోనే ఫస్ట్ ఐఫోన్ 14 ప్రో కొనుగోలు చేసేందుకు ఇలా చేశాడు. ఇందుకోసం దాదాపు రూ.1,29,000 వెచ్చించాల్సి వచ్చింది. అతను ఐఫోన్ కొనడానికి దుబాయ్ వెళ్లడం ఇదే మొదటిసారి కాదు . అతను వరుసగా నాల్గవసారి దుబాయ్ వెళ్లాడు. మొదటి రోజు అమ్మకంలో కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడం అతని హ్యాబీ అట. దీనికి ముందు, అతను ఐఫోన్ 8 కొనుగోలు కోసం 2017లో మొదటిసారిగా దుబాయ్ వెళ్ళాడు. దీని తరువాత, అతను ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 12 ఐఫోన్ 13 కొనుగోలు చేయడానికి మొదటి రోజునే దుబాయ్ వెళ్ళాడట. చేతిలో పైసలు ఉండాలి కానీ దుబాయ్ ఏంటి…ఎక్కడికైనా వెళ్లొచ్చని నెటిజన్లు అంటున్నారు.