Site icon HashtagU Telugu

వాట్సాప్‌లో లింక్ పంపారు.. క్లిక్ చేయగానే 9 లక్షలు కొట్టేశారు

26 11 2020 Whatsapp Crime 21101903

26 11 2020 Whatsapp Crime 21101903

సైబర్ మోసానికి సంబంధించిన మరో కేసు తెరపైకి వచ్చింది.
ముంబైలోని బోరివలీ తూర్పు ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినిని మోసగాళ్లు రూ.9 లక్షలకు పైగా మోసం చేశారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దహిసర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 419 , 420, IT చట్టంలోని సెక్షన్లు 66 (c) , 66 (d) కింద కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే..

పుష్పలత ప్రదీప్ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.  తన ప్రావిడెంట్ ఫండ్ పొదుపు మొత్తాన్ని ఆమె ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించి కొన్ని సమస్యలను ఆమె ఎదుర్కొంది. దీనిపై ఆమె ఆన్‌లైన్‌లో బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.యూనియన్ బ్యాంక్ సైట్‌లో ఫిర్యాదు నమోదు చేస్తున్నప్పుడు, ఆమెకు పదేపదే ఎర్రర్స్ వచ్చాయి. ఈ క్రమంలో బాధితురాలు తన ఫోన్ నంబర్‌ను ఆ ఎర్రర్ పేజీలో నమోదు చేసింది. ఆ వెంటనే ఆమె నంబర్‌కు రెండు కాల్స్ వచ్చాయి. తమను తాము వాళ్ళు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ లుగా పరిచయం చేసుకున్నారు. ఫిర్యాదు నమోదుకు సంబంధించిన మొబైల్ యాప్ లింక్ అంటూ ఒక యూఆర్ఎల్ ను
బాధితురాలి వాట్సాప్ కు పంపారు. ఆ యాప్ ను ఆమె డౌన్ లోడ్ చేసుకొని, అందులో తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను నింపింది. ఆ వెంటనే ఆమె ఖాతాలోని 9 లక్షలను దొంగలు తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు. డబ్బు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని బాధిత మహిళ గుర్తించింది. మోస పోయానని తెలుసుకున్న బాధితురాలు వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి యూనియన్ బ్యాంక్ కాల్ సెంటర్ కు మరో ఫోన్ నుంచి కాల్ చేసి సమాచారం అందించింది. ఇటువంటి పరిస్థితిలో వినియోగదారులు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసే ముందు మీరు ఆలోచించాలి.
వినియోగదారులు ఎల్లప్పుడూ ఏదైనా యాప్‌ని విశ్వసనీయ సోర్స్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.