Nothing Phone 1: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్..నథింగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్?

నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే ఎన్నో రకాల ఆకర్షణీయమైన అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి

  • Written By:
  • Publish Date - November 9, 2022 / 07:00 PM IST

నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే ఎన్నో రకాల ఆకర్షణీయమైన అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. నథింగ్ ఫోన్ టెక్ మార్కెట్ లో తనదైన ముద్రను కూడా వేసుకుంది. కాగా బ్రిటన్ కు చెందిన ఈ సంస్థ నథింగ్ ఫోన్ 1 పేరుతో తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్ అమ్మకాలు ప్రస్తుతం మార్కెట్ లో జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ కి అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ దక్కింది. ఈ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ను సగం జరిగే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

అదే నాకు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నథింగ్‌ ఫోన్‌ 1,12 జబీ ర్యామ్‌,256 జీబీ ఉన్న ఈ ఫోన్‌ అసలు ధర రూ. 37,999 గా ఉంది. అయితే దీని పై క్యాష్‌బ్యాక్‌ కూపన్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్ రూ. 5000 వరకు భారీ డిస్కౌంట్‌ ను అందిస్తోంది. దీంతో పాటుగా పాత ఫోన్‌ ను ఎక్సేంజ్‌ చేయడం ద్వారా రూ. 17,500 తగ్గింపు ధర పొందవచ్చట. అలా అన్ని ఆఫర్లను కలిపి ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 15,499 కే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్‌బాక్, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ పై 25 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.

అలాగే రూ.6,699 విలువైన గూగుల్ ఆడియోను ఇస్తోందట. నథింగ్ ఫోన్‌ 1 ఫీచర్ ల విషయానికి వస్తే..కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫొన్‌ సొంతం. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 12 జీబీ ర్యామ్ 256 జీబీ వేరియంట్ లలో కూడా లభిస్తోంది.