Site icon HashtagU Telugu

Space X Satellites : అంత‌రిక్షంలో క‌ల్లోలం.. సౌర‌తుఫాను వ‌ల్ల 40 శాటిలైట్లు ధ్వంసం

Space X

Space X

శాటిలైట్ల ద్వారా ఇంట‌ర్నెట్ స‌దుపాయాన్ని అందించేందుకు కృషిచేస్తున్న ఎలాన్ మ‌స్క్‌కి (Elon Musk) చెందిన‌ స్పేస్ ఎక్స్ (Space X) కంపెనీకి భారీ న‌ష్టం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 3న అంత‌రిక్షంలో సంభ‌వించిన అతిపెద్ద సౌర‌తుఫాను (Geo Magnetic Storm)  వ‌ల్ల ఆ కంపెనీకి చెందిన 40 నుంచి 40 శాటిలైట్లు ధ్వంసం అయ్యాయి. ఇప్ప‌టికే భూమి నుంచి లాంచ్ అయిన ఆ శాటిలైట్లు ఇంకా నిర్ణీత క‌క్ష‌లోకి చేరుకోలేదు. ఈ లోగా సంభ‌వించిన సౌర‌తుఫాను వ‌ల్ల అవి పేలిపోయాయ‌ని భావిస్తున్న‌ట్టు కంపెనీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సౌర‌తుఫాను నుంచి త‌ప్పించుకునే విధంగా శాటిలైట్ల‌ను సేఫ్ మోడ్ క‌మాండ్‌లోకి పంపినా కూడా అతి త‌క్కువ దూరంలో అవి స్పేస్ స్టార్మ్‌ను తాకాయ‌ని, అందువ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పేర్కొంది.

ఇప్ప‌టికే 2వేల శాటిలైట్ల‌ను లాంచ్ చేసిన స్పేస్ ఎక్స్‌.. మొత్త‌మ్మీద 12వేల శాటిలైట్ల‌ను అంత‌రిక్షంలోకి పంపాల‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇంత పెద్ద టార్గెట్ ముందు ఈ న‌ష్టం పెద్దది కాక‌పోవ‌చ్చు కానీ.. దాని వ‌ల్ల జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను మాత్రం త‌న ఆప‌రేష‌న్స్‌ను న‌ష్ట‌ప‌రుస్తాయ‌ని అంటోంది కంపెనీ. ఈ స్ధాయిలో అంత‌రిక్షంలో శాటిలైట్ల‌ను పంపించ‌డం ద్వారా జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌పై ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఉల్క‌లు, ఇలాంటి సౌర‌తుఫాన్ల వ‌ల్ల భారీ స్ధాయిలో న‌ష్టం వ‌స్తుందని, స్పేస్ జంక్ పెరిగిపోతోంద‌నే వాద‌న‌లూ వినిపిస్తున్నాయి.