WhatsApp Chat Lock New Feature : వాట్సాప్ చాట్ పై వినియోగ దారులకు మరింత నియంత్రణను అందించే కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం దీని డెవలప్మెంట్ పై వాట్సాప్ పనిచేస్తోందని సమాచారం. త్వరలోనే వినియోగదారులు వారి వేలిముద్ర లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి ఎంపిక చేసుకునే చాట్‌లను లాక్ చేసి దాచుకోవచ్చు.లాక్ చేయబడిన చాట్‌లో పంపబడిన ఫోటోలు, వీడియోల వంటి మీడియా ఫైల్‌లు ఆటోమేటిక్ గా ఇతరుల ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయబడవు. చాట్ లాక్ చేయబడిన తర్వాత.. వినియోగదారు వేలిముద్ర లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి మాత్రమే దాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ లాక్ చేయబడిన చాట్‌లను WhatsApp లో తెరవడానికి ప్రయత్నించి విఫలమైతే, దానిని తెరవడానికి చాట్‌ను క్లియర్ చేయమని నివేదించబడతారు. వాట్సాప్ ఈ ఫంక్షనాలిటీపై పని చేస్తోందని, భవిష్యత్ అప్‌డేట్‌లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది చివరి విడుదలకు ముందే అప్ డేట్ కావచ్చు. Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా Android బీటా v2.23.8.2 వర్షన్ కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇది ఇంకా బీటా టెస్టర్‌లకు కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఫేస్ ID, వేలిముద్ర లేదా పాస్‌కోడ్ లను ఉపయోగించి మొత్తం యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో లాక్ చేయొచ్చు.
టెక్స్ట్ ఎడిటింగ్, ఆడియో చాట్..
ఇటీవల ఆండ్రాయిడ్ 2.23.7.17 అప్‌డేట్‌తో పాటు ఎంపిక చేసిన బీటా టెస్టర్‌ల కోసం టెక్స్ట్ ఎడిటింగ్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు వెల్లడైంది.ఇది కొత్త ఫీచర్‌తో అందించబడిన టూల్స్ మరియు ఫాంట్‌లను ఉపయోగించడం ద్వారా ఇమేజ్‌లు, వీడియోలు, GIFలను ఎడిట్ చేయడానికి వినియోగ దారులకు సహాయం చేస్తుంది. ఇది ప్రత్యేక ఆడియో చాట్ ఫీచర్‌ను కూడా విడుదల చేయాలని చూస్తోంది .
- టెక్ట్స్ అలైన్మెంట్ ఫీచర్ తో యూజర్ తనకు నచ్చిన వైపు దాన్ని మార్చుకోవచ్చు. అంటే కుడి, ఎడమ, సెంటర్ వైపులకు పెట్టుకోవచ్చు.
- టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తో మొత్తం టెక్ట్స్ లో మీకు హైలెట్ అవ్వాలనుకునే ముఖ్యమైన భాగాన్ని ప్రత్యేకంగా కనిపించేలా మార్పులు చేయొచ్చు. అలాగే నచ్చిన రంగు లేదా ఫొటోను టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు.
- అలాగే కొన్ని కొత్త ఫాంట్లను కూడా వాట్సాప్ ఈ అప్ డేట్ లో ఇవ్వనుంది. కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్ ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ వంటి ఫాంట్లు బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.
Also Read: E Bike R.x275: సైకిల్ కాదు.. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్.. స్పెషాలిటీస్ అదుర్స్