Band Aid For Heart : గుండెకు బ్యాండ్ ఎయిడ్.. రెడీ చేసిన శాస్త్రవేత్తలు

‘బ్యాండ్‌ ఎయిడ్‌’.. మన చర్మంపై గాయాలైతే పెట్టుకుంటాం. కానీ గుండెకు గాయమైతే ఎలా ?‘బ్యాండ్‌ ఎయిడ్‌’.. మన చర్మంపై గాయాలైతే పెట్టుకుంటాం. కానీ గుండెకు గాయమైతే ఎలా ?

Published By: HashtagU Telugu Desk
Band Aid For Heart 3d Printing

Band Aid For Heart : ‘బ్యాండ్‌ ఎయిడ్‌’.. మన చర్మంపై గాయాలైతే పెట్టుకుంటాం. కానీ గుండెకు గాయమైతే ఎలా ? శరీరం లోపల ఉండే ఆ సున్నితమైన అవయవానికి బ్యాండ్ ఎయిడ్ పెట్టలేం కదా ? ఈ ప్రశ్నకు అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ  శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారు. అధునాతన త్రీడీ టెక్నాలజీని వినియోగించి గుండె స్పందనలకు తగిన విధంగా సాగే స్వభావాన్ని కలిగిన ప్రత్యేక మెటీరియల్‌ను తయారు చేశారు. సాగే స్వభావాన్ని కలిగి ఉండటంతో పాటు ఇది గట్టిగా కూడా ఉంది.

We’re now on WhatsApp. Click to Join

గుండెకు గాయం కావడం అంటే అందులోని కార్టిలేజ్‌ కణజాలాలు దెబ్బతినడం. మన శరీరంలోని ఇతర కణాలు దెబ్బతింటే రికవర్ కావడం ఈజీ. కానీ గుండెలోని కార్టిలేజ్ కణాలు దెబ్బతిన్నాయో.. వాటికి మరమ్మతులు చేసి పూర్వ స్థితికి చేర్చడం అసాధ్యం.   అందుకే గుండె చికిత్సలను చాలా సున్నితమైనవిగా పరిగణిస్తారు. గుండెలోని(Band Aid For Heart) సజీవ కణాలు సహజంగానే చాలా బలంగా ఉంటాయి. గుండె కదలికలకు అనుగుణంగా సైజును మార్చుకునే స్థితిస్థాపకత వాటి సొంతం. తాజాగా 3డీ టెక్నాలజీతో అమెరికా సైంటిస్టులు తయారుచేసిన మెటీరియల్ కూడా అచ్చం అదే విధమైన గుణగణాలతో ఉండటం విశేషం.

Also Read :Cretaceous Dinosaur: అతిచిన్న డైనోసార్ల పాదముద్రలు వెలుగులోకి.. ఎక్కడ ?

మనిషి శరీరంలో అమర్చేందుకు వినియోగించే ఆర్టిఫీషియల్ జీవ కణాలు, అవయవాలు, ఇంప్లాంట్‌ల తయారీకి హైడ్రోజెల్‌ అనే పదార్థాన్ని వాడుతుంటారు. సాధారణ 3డీ టెక్నాలజీలో వీటిని తయారు చేస్తే తగినంతగా సాగే స్వభావాన్ని ఇవి పొందలేకపోతున్నాయి. ఎక్కువగా సాగే క్రమంలో విరిగిపోతున్నాయి. బాగా ఒత్తిడి ఏర్పడిన టైంలో వాటికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. వానపాములు పరస్పరం పెనవేసుకుంటాయి. ఆ వెంటనే విడిపోతుంటాయి. అవి ఒక్కోసారి బంతిలాంటి డిజైన్‌లోకి మారుతుంటాయి.

Also Read :Greece Wildfire : గ్రీస్ రాజధానికి చేరువలో కార్చిచ్చు.. ఏథెన్స్‌లో హైఅలర్ట్

ఈక్రమంలో వానపాముల్లో ఘన, ద్రవ పదార్థాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇదే విధమైన స్వభావం కలిగిన రా మెటీరియల్‌తో ఆర్టిఫీషియల్ జీవ కణాలు, అవయవాలు, ఇంప్లాంట్‌లను తయారు చేస్తే బాగుంటుందని కొలరాడో విశ్వవిద్యాలయ  శాస్త్రవేత్తలు భావించారు. ఇలా తయారయ్యే ఆర్టిఫీషియల్ జీవ కణాలు, అవయవాలు, ఇంప్లాంట్‌లు గట్టిగా ఉండటంతో పాటు సాగే స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయనే నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం ‘క్లియర్‌’ అనే కొత్త ప్రింటింగ్‌ టెక్నాలజీని వినియోగించారు. ఈ టెక్నాలజీ వల్ల 3డీ ముద్రిత పదార్థాల్లోని పొడవైన రేణువులు పెనవేసుకుపోయాయి.  ఈవిధంగా తయారైన మెటీరియల్‌ను సాగదీసి చూశారు. దానిపై బరువు మోపి టెస్ట్ చేశారు. సాధారణ త్రీడీ ప్రింటింగ్‌తో పోలిస్తే ఈ మెటీరియల్ బలంగా ఉందని పరీక్షల్లో తేలింది. గుండె లబ్‌డబ్‌లకు అనుగుణంగా సాగే గుణం ఈ మెటీరియల్‌కు ఉందని సైంటిస్టులు చెప్పారు. శరీరంలోని కీళ్లపై పడే భారాన్ని ఇది తట్టుకోగలదన్నారు.

  Last Updated: 12 Aug 2024, 08:56 AM IST