Flipkart Sale: ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ పై భారీ ఆఫర్.. ధర, ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు స్మార్ట్ వాచ్ ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నపిల్లల

  • Written By:
  • Publish Date - February 11, 2023 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు స్మార్ట్ వాచ్ ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాచ్ ల కొనుగోలుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో పలు రకాల స్మార్ట్ వాచ్ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఒక కంపెనీని మించి మరొక కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో అతితక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫైర్‌బోల్ట్ సంస్థ తమ కంపెనీ తరఫున స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తోంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న వ్యాలెంటైన్ వీక్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ వాచ్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది ఫైర్ బోల్ట్ సంస్థ. తమ ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 70 శాతం తగ్గింపు ధరతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. రూ.7000 విలువైన స్మార్ట్ వాచ్‌ను రూ.2999కే సేల్‌లో అందుబాటులో ఉంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు మెటల్ బాడీ ఈ వాచ్ ప్రత్యేకత. అలాగే 1.39 అంగుళాల కలర్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఈ వాచ్ వినియోగదారులను అలరిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో గరిష్టంగా 123 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. అలాగే ఈ వాచ్‌ను ధరిస్తే శరీరంలోని హర్ట్ రేట్, ఆక్సిజన్ రేట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునే అవకాశం ఉంది.

అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లోని టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, స్పీకర్లు మంచి నాణ్యతతో ఉండడంతో కస్టమర్ల మనస్సును ఈ వాచ్ దోచుకుంది. ఈ నేపథ్యంలో ఈ వాచ్‌పై గణనీయమైన తగ్గింపును ప్రకటించడంతో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇకపోతే ఫైర్‌బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్ వాచ్‌ ఫీచర్ ల విషయానికి వస్తే.. 1.39 అంగుళాల డిస్‌ప్లేతో బ్లూ కలర్ సర్క్యులర్ డయల్, 240X240 డిస్‌ప్లే రిజుల్యూషన్, సిలికాన్ వేరియబుల్, టచ్ స్క్రీన్, వాటర్ రెసిస్టెంట్‌తో అండ్రాయిడ్ ఐఓఎస్ కనెక్టవిటీ,బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో, పవర్ ఫుల్ స్పీకర్, వాయిస్ అసెస్టెంట్ ద్వారా కమాండ్ చేసుకునే అవకాశం ఇందులో లభిస్తున్నాయి.