Site icon HashtagU Telugu

Cracked Screen: స్క్రీన్ పగిలిపోయినప్పటికీ అలాగే ఉపయోగిస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి?

Mixcollage 07 Feb 2024 03 46 Pm 3260

Mixcollage 07 Feb 2024 03 46 Pm 3260

మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో చిన్నచిన్న పొరపాట్ల వల్ల మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల మొబైల్ స్క్రీన్ పగిలిపోవడం అన్నది కామన్. అలా మొబైల్ ఫోన్ కింద పడిపోయినప్పుడు పైన గ్లాస్ మాత్రమే పగిలి పోతే కొన్ని కొన్ని సార్లు లోపల కాంబో కూడా పగిలిపోతూ ఉంటుంది. స్క్రీన్ దెబ్బతిన్నా ఫోన్ బాగానే పనిచేస్తూ ఉంటుంది. దీంతో చాలామంది స్క్రీన్ బాగు చేయించడం కోసం డబ్బులు పెట్టడం ఇష్టం లేక ఆ స్క్రీన్ పగిలిపోయినప్పటికీ దానిని అలాగే వినియోగిస్తూ ఉంటారు. అలా పగిలిపోయిన స్క్రీన్ తో మొబైల్ ని ఉపయోగించడం అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

మన స్క్రీన్ పగిలిపోయినప్పటికీ మొబైల్ ఫోన్ అలాగే వినియోగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పగిలిన లేదా విరిగిన స్క్రీన్ గాయం కలిగించే పదునైన అంచులను కలిగి ఉండవచ్చు. ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, మీ వేళ్లు గాయపడవచ్చు విరిగిన భాగాలు కూడా మీ శరీరం లోపలికి వెళ్లవచ్చు. మీరు విరిగిన స్క్రీన్‌తో ఫోన్‌ని ఉపయోగిస్తే, మీరు టచ్‌స్క్రీన్ నుంచి ఇదివరకటిలా టచ్ పనిచెయ్యకపోవచ్చు. అందువల్ల మీరు ఒకటి టచ్ చేస్తే, మరొకటి ఆన్ అవ్వవచ్చు. దాంతో లేనిపోని చిక్కులు ఎదురవ్వవచ్చు. ముఖ్యంగా విరిగిన స్క్రీన్ ఉన్న ఫోన్లతో మనీ లావాదేవీలను జరపకపోవడం మేలు. ఫోన్‌లో పగుళ్ల కారణంగా తేమ సులభంగా ఫోన్‌ లోకి చేరుతుంది.

దీని వల్ల ఫోన్‌లోని అంతర్గత భాగాలు దెబ్బతింటాయి. అటువంటి పరిస్థితిలో, ఫోన్ పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. ఫోన్ విరిగిన స్క్రీన్ కారణంగా, దుమ్ము, ధూళి లోపలికి ప్రవేశించవచ్చు. ఇది క్రమంగా మందపాటి పొరగా మారుతుంది. ఇది ఫోన్ పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఫోన్ వేడెక్కడం వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు. మీ ఫోన్‌లో చిన్న పగుళ్లు ఉంటే, వెంటనే సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే ఇది చేయకపోతే, పగుళ్లు పెద్దవిగా మారవచ్చు. ఫోన్ అకస్మాత్తుగా పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. అలాగే పగిలిపోయిన స్క్రీన్ లో మళ్ళీ మార్కెట్లో వినియోగిస్తే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో చాలామంది అలా అమ్మడం ఇష్టం లేక అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ ఇక మీదట స్క్రీన్ పగిలిపోయిన అలాగే అసలు ఉపయోగించకండి. ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీరు పగిలిపోయిన స్మార్ట్ ఫోన్ ని ఇతరులకు అమ్మాలి అనుకుంటే అటువంటి పరిస్థితిలో, మీరు ఫోన్‌ను విక్రయించాలనుకుంటే, ముందుగా దాని స్క్రీన్‌ను రిపేర్ చేయాలి. తర్వాత అమ్మితే మంచి ధర పలుకుతుంది.