Site icon HashtagU Telugu

Amazon Offers : 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ఫీచర్లు ధర ఇవే?

Amazon Offers

Amazon Offers

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకోసం మొబైల్ తయారీ సంస్థలు అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్ లు కలిగిన మొబైల్ ఫోన్ లు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఒక అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ను భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చని తెలిపింది అమెజాన్ సంస్థ. కాగా షావోమి 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.

అలాగే 108 కెమెరా, 120 వాట్ చార్జింగ్ స్పీడ్ లాంటి సూపర్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 36,999 ధరకే పొందొచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్ అసలు ధర రూ. 52,999. అనగా మీకు ఈ స్మార్ట్ ఫోన్‌ పై 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే బ్యాంకు క్రెడిట్ కార్డు కలిగిన వారికి రూ. 4 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ విధంగా ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే షావోమి 11టీ ప్రో స్మార్ట్ ఫోన్‌ను రూ. 32,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఏకంగా రూ. 30,000 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ ల విషయానికి వస్తే..

ఇందులో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సమర్థమును కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈఎంఐ లో లభించనుంది. కాగా నెలవారీ ఈఎంఐ రూ. 1768 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 3339 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 6167 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది.

Exit mobile version