Site icon HashtagU Telugu

Infinix Smart 8 Plus: కేవలం రూ. 7వేలకే 50 ఎంపీ కెమెరా.. ఆకట్టుకుంటున్న ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ ఫోన్?

Mixcollage 17 Jun 2024 07 00 Pm 4255

Mixcollage 17 Jun 2024 07 00 Pm 4255

హాంగ్‌కాంగ్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫినిక్స్‌ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇన్‌ఫినిక్స్‌ 8 ప్లస్ పేరుతో ఒక బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో తీసుకొచ్చారు. టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. అలాగే ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి36 ప్రాసెసర్‌ను అందించారు. అంతేకాకుండా ఇందులో IMG Power VR GE 8320 GPU వంటి పవర్‌ఫుల్ గ్రాఫిక్‌ కార్డును అందించారు. దీంతో మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు.

ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. మ్యాజిక్ రింగ్ బెజెల్‌తో ఫ్లూయిడ్ పంచ్ హోల్ డిస్‌ప్లేను ఇచ్చారు. 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ తో తీసుకొచ్చారు. కాగా ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఆర్టిఫిషియల్ లెన్స్‌తో క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ సపోర్ట్ ఈ కెమెరా సొంతం. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌ ధర రూ. 7,799కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 500 డిస్కౌంట్‌తో రూ. 7299కే లభిస్తోంది.

Exit mobile version