Site icon HashtagU Telugu

Google Search Upgrade : గూగుల్ సెర్చ్ లో 2 కొత్త AI ఫీచర్స్

Googl Search Upgrade

Googl Search Upgrade

గూగుల్ సెర్చ్.. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగించే ఇంటర్నెట్ సర్ఫింగ్ టూల్. ఇందులో పెద్ద అప్ గ్రేడ్ (Google Search Upgrade) చేసేందుకు గూగుల్ రెడీ అవుతోంది. తమ సెర్చ్ ఇంజిన్‌ను మరింత “విజువల్, స్నాక బు ల్, పర్సనల్ , హ్యూమన్” లక్షణాల వేదికగా మార్చాలని (Google Search Upgrade) ప్లాన్ చేస్తోంది అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ శనివారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చాట్‌ జీపీటీ వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్లికేషన్‌లు వేగంగా జనాదరణ పొందుతున్న ప్రస్తుత తరుణంలో .. అందుకు అనుగుణంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ పనిచేసే విధానాన్ని మెరుగుపర్చడంపై గూగుల్ ఫోకస్ పెట్టిందని పేర్కొంది. గూగుల్ లో మన ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు.. ఆ టాపిక్ కు సంబంధించిన , ఆ తరహా టాపిక్ తో కూడిన 10 బ్లూ కలర్ లింక్ లు మన ముందు ప్రత్యక్షం అవుతాయి. రానున్న రోజుల్లో AIతో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను అప్ గ్రేడ్ చేయడం ద్వారా మరిన్ని అదనపు ఫీచర్లు మనకు గూగుల్ సెర్చ్ చేసే సందర్భాల్లో కనిపించనున్నాయి. మనం సెర్చ్ చేసిన టాపిక్ కు సంబంధించిన విషయాలను చూపిస్తూనే .. అటువంటి మరిన్ని టాపిక్స్ కు సమాచారాన్ని ఫ్రెండ్లీ పద్ధతిలో మనకు వివరించే హెల్పర్ పాత్రను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) పోషిస్తుందనని టెక్ నిపుణులు అంటున్నారు. AI ద్వారా వాయిస్ సపోర్ట్, వీడియో క్లిప్స్ చూపించడం వంటి సర్వీస్ లు గూగుల్ లో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే వారం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ హెడ్ ఆఫీస్ లో వార్షిక I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌ జరుగనుంది. ఈ ప్రోగ్రామ్ వేదికగా AI తో గూగుల్ సెర్చ్ వినియోగదారులు ఛాటింగ్ నిర్వహించడానికి అనుమతించే కొత్త ఫీచర్‌ ను “Magi” పేరుతో గూగుల్ లాంచ్ చేయనుందని అంటున్నారు. జెనరేటివ్ AI అనేది ఈ సంవత్సరం టెక్ ప్రపంచంలో ఒక సంచలనాత్మక పదం. మొబైల్ యాప్స్ ద్వారా ప్రజల అభిరుచులను కూడగట్టి.. వాటి ఆధారంగా కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ను అభివృద్ధి చేసేందుకు జెనరేటివ్ AI బాటలు వేస్తుంది.

ALSO READ : Microsoft AI: మైక్రోసాఫ్ట్ ChatGPT కి పోటీగా.. గూగుల్ AI USM.. 1000 భాషల్లో సపోర్ట్

Google I/O 2023 ఎప్పుడు?

ప్రతి సంవత్సరం అమెరికాలోని కాలిఫోర్నియాలోని గూగుల్ హెడ్ ఆఫీస్ లో Google I/O 2023 కాన్ఫరెన్స్ జరుగుతుంటుంది. ఈసారి ఈ ప్రోగ్రాంను మే 10 న నిర్వహిస్తున్నామని గూగుల్ ప్రకటించింది. ఈ ప్రోగ్రాం లో డైరెక్ట్ గా పాల్గొనలేని వాళ్ళు వర్చువల్‌గా కూడా అటెండ్ కావచ్చు.