Site icon HashtagU Telugu

WhatsApp Disappearing Messages: వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజెస్ కోసం 15 కొత్త టైమింగ్స్

WhatsApp Disappearing Messages

15 New Timings For Whatsapp Disappearing Messages

WhatsApp Disappearing Messages : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. డిసప్పియరింగ్ మెసేజెస్ కోసం మరిన్ని టైం సెట్టింగ్స్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం డిసప్పియరింగ్ మెసేజెస్ కోసం 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల టైమింగ్స్ ఉన్నాయి. వీటికి తోడుగా 15 కొత్త టైం డ్యూరేషన్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ రెడీ అవుతోంది. దీనివల్ల వినియోగదారులు వాళ్లు పంపే, స్వీకరించే మెసేజ్ లపై ఎక్కువ కంట్రోల్ ను పొందుతారు. వాట్సాప్ వినియోగదారుడు తనకు వచ్చే, తాను పంపే మెసేజ్ ఎప్పట్లోగా డిసప్పియర్ కావాలో స్వయంగా డిసైడ్ కావచ్చు. మనం సెట్ చేసే టైం తర్వాత మెసేజ్ లు డిసప్పియర్ అవుతాయి. ఈమేరకు WABetaInfo ఒక రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. దీనివల్ల వాట్సాప్ (WhatsApp) యూజర్ల  సంభాషణల గోప్యత పెరుగుతుందని భావిస్తున్నారు.

15 కొత్త టైమింగ్స్ ఇవే..

  1. ఒక సంవత్సరం, 180 రోజులు, 60 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 14 రోజులు, 6 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 12 గంటలు, 6 గంటలు, 3 గంటలు మరియు 1 గంట.
  2. 1 – గంట వ్యవధి అనేది ముఖ్యంగా సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న మెసేజ్ లకు ఉపయో గకరంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ టైమింగ్ తో పంపే మెసేజ్.. 1 గంట తర్వాత మెసేజ్ గ్రహీత ఫోన్ లో ఉండదు.

ఆడియో చాట్‌ ఫీచర్‌ వస్తోంది.. 

టెక్స్ట్ చాట్‌ మాదిరిగా ఆడియో చాట్‌ ఫీచర్‌ను పరిచయం చేసేందుకు వాట్సాప్ ఏర్పాట్లు చేస్తోంది. వాట్సాప్‌లో ఇప్పటికే వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. వాయిస్ నోట్ సెండ్ చేసే ఫీచర్ కూడా ఉంది. అయితే త్వరలో వాయిస్ చాట్ కోసం స్పెషల్ విండోను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్‌ (WhatsApp) ఆండ్రాయిడ్ 2.23.7.12 బీటాలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని వాట్సాప్ బీటా ఇన్‌ఫో (WaBetaInfo) పేర్కొంది. ఈ ఆడియో చాట్‌ ఆప్షన్‌ ప్రస్తుతం డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉంది. దీంతో ఇది ఎలా పనిచేస్తుందనే వివరాలు ప్రస్తుతానికి పూర్తిగా తెలియదు.ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ముందు ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే తీసుకురానున్నారు. టెస్టింగ్ తర్వాత iOSకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని భావిస్తున్నారు. అయితే ఈ అప్‌డేట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వాట్సాప్ బీటా ఇన్‌ఫో వెల్లడించలేదు. దీంతో వాట్సాప్‌ యూజర్లు ఆడియో చాట్‌ ఫీచర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read:  EV Stations: దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ EV స్టేషన్లు.. 800 కోట్లు మంజూరు..