Site icon HashtagU Telugu

Moto G13: మోటోరోలా ఫోన్ పై భారీగా తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?

Moto G13

Moto G13

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. కాగా మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్ లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్ లను పరిచయం చేస్తోంది. అలాగే ఆ ఫోన్ లపై భారీగా తగ్గింపు ప్రకటిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితేర్.. మోటోరోలా కంపెనీకి చెందిన జీ13 స్మార్ట్‌ఫోన్‌ పై మీరు ఏకంగా రూ. 4 వేల తగ్గింపు పొందవచ్చు.

ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉండవచ్చు. అందువల్ల తక్కువ ధరకే కొత్త ఫోన్ కొనే వారు ఈ ఆఫర్ ని గమనించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ13 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,999గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 9,999కే కొనవచ్చు. అంటే మీకు రూ. 4 వేల డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ. 8850 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే అప్పుడు మీరు ఇంకా చౌక ధరకే ఈ కొత్త ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీ పాత ఫోన్ ఆధారంగా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ మారుతుంది. మీ ఫోన్‌కు తక్కువ ఎక్స్చేంజ్ డీల్ కూడా రావచ్చు.

4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 6.5 ఇంచుల స్క్రీన్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్త్యాన్నీ కూడా కలిగి ఉండనుంది. హీలియో జీ85 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండొచ్చు. అందువల్ల కొత్త ఫోన్ కొనే వారు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు తక్కువ ఈఎంఐతో కూడా ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 352 నుంచి ప్రారంభం అవుతోంది. 36 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. ఇంకా 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 490 చెల్లించాలి. ఇంకా 18 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 624 చెల్లించాలి. ఏడాది పాటు టెన్యూర్ అయితే నెలకు రూ. 903 పడుతుంది. 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1177 పడుతుంది. 6 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1736 చెల్లించాలి. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3400 పడుతుంది. క్రెడిట్ కార్డు ఆధారంగా ఈఎంఐ మారుతుంది.