Site icon HashtagU Telugu

Zimbabwe: పాకిస్తాన్ గాలి తీసిన జింబాబ్వే అధ్యక్షుడు…నెక్ట్స్ టైం రియల్ బీన్ పంపించాలంటూ..!!

Zimbabwe

Zimbabwe

T20ప్రపంచ కప్ చాలా యమరంజుగా సాగుతోంది. పసికూన జింబాబ్వే, పాకిస్తాన్ ను గురువారం దారుణంగా ఓడించింది. మొన్న ఐర్లాండ్ కూడా ఇంగ్లండ్ ను చిత్తుచేసింది. చిన్న జట్లు పెద్ద జట్లకు గట్టి షాకిస్తున్నాయి. దీంతో టీ20 మరింత ఆసక్తికరంగా సాగుతోంది. పాక్ పై ఒక్క పరుగుతో జింబాబ్బే చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజా పాకిస్తాన్ పగలే చుక్కలు చూపించాడు. మూడు వికెట్లు తీసి పాన్ నడ్డి విరిచాడు.

ఈ వార్త ప్రపంచంలోనే పెను సంచలనంగా మారింది. జింబాబ్వే ఆటగాళ్లు చూపించిన తెగువకు ప్రపంచమంతా ప్రసంశల జల్లులు కురిపించింది. భారత్ లోనూ సంబురాలు చేసుకున్నారు. జింబాబ్వేను అభినందనలతో ముంచెత్తారు క్రికెట్ అభిమానులు. కాగా ఈ మ్యాచ్ తర్వాత టాప్ కమెడియన్ మిస్టర్ బీన్ పేరుతో ట్రెండింగ్ లోకి వచ్చింది. మిస్టర్ బీన్ పదాన్ని స్వయం జింబాబ్వే ప్రెసిడెంట్ ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా సైతం ఉపయోగించాడు. దీనికి కారణం ఉంది.

2016లో జింబాబ్వే రాజధానిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రజలను అవమానపరించింది పాకిస్తాన్ . మిస్టర్ బీన్ తో పోలిన పాకిస్తాన్ కమెడియన్ ఆసిఫ్ మహ్మద్ మిస్టర్ బీన్ గా యాక్ట్ చేశాడు. అందరు నిజమైన బీన్ అనుకని అతడితో ఫోటోలు దిగేందుకు ఆసక్తిచూపారు. దీనికోసం 10 డాలర్లను కూడా చెల్లించారు. ఆ తర్వాత నిజం తెలిసి షాక్ అయ్యారు. ఇప్పుడు జింబాబ్వే అప్పటి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. తర్వాత రియల్ మిస్టర్ బీన్ ను పంపించండంటూ ఆ దేశ అధ్యక్షుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాక్ కు చురకలు అంటించారు. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.