జింబాబ్వే టూర్ (Zimbabwe Tour) లో యంగ్ ఇండియా (Young India )కు షాక్ తగిలింది. ఊహించని విధంగా జింబాబ్వే 13 రన్స్ తేడాతో భారత్ పై సంచలన విజయం (Zimbabwe Won) సాధించింది. ఆతిథ్య జట్టు 115 పరుగుల స్కోరును కాపాడుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కంగారెత్తించారు. తొలి బంతికే ముఖేశ్ కుమార్ వికెట్ పడగొట్టగా… పవర్ ప్లేలో జింబాబ్వే ధాటిగానే ఆడింది. అయితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన బిష్ణోయ్ తన స్పిన్ మ్యాజిక్ తో జింబాబ్వే బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి రెండు ఓవర్లలో 3 పరుగులకే ఇచ్చిన ఈ యువ స్పిన్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో జింబాబ్వే 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్కోరు 100 దాటడం కష్టంగా కనిపించింది. ఈ పరిస్థితుల్లో మేయర్స్ 23 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్ క్లైవ్ కూడా ధాటిగా ఆడి 29 పరుగులు చేయడంతో జింబాబ్వే స్కోర్ 115కు చేరగలిగింది. భారత బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి రెండు మెయిడన్లతో 4 వికెట్లు పడగొట్టాడు. వాష్గింగ్టన్ సుందర్ 2 , ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
లక్ష్యం చిన్నదే కావడం, యువక్రికెటర్లు ఫామ్ లో ఉండడంతో భారత్ ఈజీగా గెలుస్తుందనిపించింది. అయితే జింబాబ్వే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో భారత యువ బ్యాటర్లను కట్టడి చేయడమే కాదు వరుస వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచారు. అభిషేక్ శర్మ డకౌట్ తో ఆరంభమైన వికెట్ల పతనం రింకూ సింగ్ డకౌట్ తో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశకు చేరింది. గిల్ ఒకవైపు పోరాడినా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లభించలేదు.అరంగేట్రం చేసిన ముగ్గురు ప్లేయర్లు అభిషేక్ శర్మ , పరాగ్, ధృవ్ జురెల్ నిరాశపరిచారు. గిల్ 31 పరుగులకు ఔటయ్యాక భారత్ ఓటమి ఖాయమనిపించింది. ఈ దశలో అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరుమీద కనిపించిన అవేశ్ ఖాన్ 16 రన్స్ కు వెనుదిరిగాడు. చివరి 3 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒకే వికెట్ చేతిలో ఉంది. 18వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి ఉండగా.. వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లు ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో భారత్ 102 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ 27 రన్స్ తో చివరి వరకూ పోరాడాడు. ఈ విజయంతో జింబాబ్వే ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో రెండో టీ ట్వంటీ ఆదివారం ఇదే స్టేడియంలో జరుగుతుంది.
Read Also : Abhishek Sharma : పాపం అభిషేక్ శర్మ…డక్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం