Site icon HashtagU Telugu

Zimbabwe:సూపర్ 12కు చేరిన జింబాబ్వే

zimbabwe

zimbabwe

టి20 ప్రపంచకప్‌ సూపర్ 12 స్టేజ్ లో చివరి బెర్తును జింబాబ్వే దక్కించుకుంది. కీలక మ్యాచ్ లో ఆ జట్టు ఐదు వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ దిగిన స్కాట్లాండ్‌ ను జింబాబ్వే బౌలర్లు నిర్ణీత 132 పరుగులకే కట్టడి చేశారు. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా లేదు. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో మున్సీ 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో చతరా, నగర్వాలు తలా రెండు వికెట్లు తీయగా.. ముజరబానీ, సికందర్‌ రాజాలు చెరొక వికెట్‌ తీశారు. తర్వాత 133 పరుగుల టార్గెట్ ను జింబాబ్వే 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అందుకుంది.

క్రెయిగ్‌ ఇర్విన్‌ 58 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. సికందర్‌ రజా 23 బంతుల్లో 40 పరుగులు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
ఈ విజయంతో జింబాబ్వే జట్టు గ్రూఫ్‌-బి టాపర్‌గా నిలిచి సూపర్‌-12లో ఇండియా, పాకిస్తాన్‌లు ఉన్న గ్రూఫ్‌-2లో చోటు దక్కించుకుంది. వెస్టిండీస్‌పై విజయం సాధించిన ఐర్లాండ్‌ బి2గా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు ఉన్న గ్రూఫ్‌-1లోకి అడుగుపెట్టింది.

Exit mobile version