Najam Sethi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు.. మరోసారి ఛైర్మన్ గా నజామ్ సేథీ..?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. నజామ్ సేథీ (Najam Sethi) స్థానంలో జకా అష్రఫ్ (Zaka Ashraf) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Najam Sethi

Compressjpeg.online 1280x720 Image (1)

Najam Sethi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. నజామ్ సేథీ (Najam Sethi) స్థానంలో జకా అష్రఫ్ (Zaka Ashraf) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అయ్యాడు. అయితే ఇప్పుడు జకా అష్రఫ్‌కు బోర్డు వీడ్కోలు పలకవచ్చు. జకా అష్రఫ్ స్థానంలో నజామ్ సేథీ తిరిగి వస్తాడనే ఊహాగానాలు మొదలు అయ్యాయి. గత నెలలో నజామ్ సేథీ స్థానంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా జాకా అష్రఫ్ బాధ్యతలు చేపట్టారు.

పీసీబీపై పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్యమాల ప్రభావం

పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్యమం వేగంగా సాగుతోంది. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ రాజకీయ ఉద్యమాల ప్రభావం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కూడా పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉంది. పాకిస్థాన్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పెనుమార్పు వచ్చే అవకాశం ఉంది. మరోసారి నజామ్ సేథీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Also Read: Sachin Tendulkar: ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్‌ టెండూల్కర్‌.. నేడు ఒప్పందం కుదుర్చుకోనున్న ఈసీ

అయితే పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి సంప్రదాయంగా అధికార పార్టీ కీలుబొమ్మ. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌పై అధికార పార్టీ ఆధిపత్యం చెలాయిస్తోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చరిత్ర చెబుతోంది. అయితే రానున్న రోజుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. నజామ్ సేథీ కంటే ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. దీని తర్వాత నజామ్ సేథీ బాధ్యతలు స్వీకరించారు. కానీ తర్వాత నజామ్ సేథీ స్థానంలో జాకా అష్రఫ్ వచ్చారు.

  Last Updated: 23 Aug 2023, 07:43 AM IST