Site icon HashtagU Telugu

RJ Mahvash: పంజాబ్ ఓట‌మి.. చాహ‌ల్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియాక్ష‌న్ వైర‌ల్!

RJ Mahvash

RJ Mahvash

RJ Mahvash: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్‌లో నిరాశపరిచే ప్రదర్శన చేసింది. పంజాబ్ అభిమానులందరూ ఈ ఓట‌మితో బాధపడ్డారు. ముల్లంపూర్ క్రికెట్ స్టేడియంలో ఉన్న యుజవేంద్ర చాహల్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవశ్ (RJ Mahvash) కూడా ఈ ప్రదర్శన చూసి బాధ‌ప‌డింది. ఆమె రియాక్షన్ వైరల్ అవుతోంది.

ముల్లంపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. సీజన్ మొత్తం అద్భుతంగా కనిపించిన ప్రియాంశ్ ఆర్య (7) రూపంలో పంజాబ్‌కు రెండో ఓవర్‌లోనే మొదటి షాక్ తగిలింది. ఆ తర్వాత వికెట్లు కుప్పకూలాయి. ప్రభసిమ్రన్ సింగ్ (18), శ్రేయస్ అయ్యర్ (4), జోష్ ఇంగ్లిస్ రూపంలో జట్టు 4 వికెట్లు పవర్‌ప్లేలోనే పడిపోయాయి. యశ్ దయాళ్, జోష్ హాజెల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్ పంజాబ్ టాప్ బ్యాట్స్‌మెన్‌లను క‌ట్ట‌డి చేసింది.

Also Read: United Nations : ఆర్థిక ఇబ్బందులో ఐక్యరాజ్యసమితి..7 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు యోచన..!

ఆ తర్వాత వచ్చిన స్పిన్నర్ సుయాష్ శర్మ కూడా ఈ ఫామ్‌నే కొనసాగించాడు. అతను తన మొదటి ఓవర్‌లోనే 2 పెద్ద వికెట్లు (శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్) తీసుకున్నాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ (26)ను బౌల్డ్ చేశాడు. దీంతో శ‌ర్మ ఖాతాలో 3 వికెట్లు ప‌డ్డాయి. అంతేకాకుండా మ్యాచ్ త‌ర్వాత‌ అతన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు.

పంజాబ్ ఓటమితో మహవశ్ నిరాశకు గురైంది

పంజాబ్ అభిమానులందరూ నిరాశలో ఉన్నారు. వారి ముఖాల నుండి నవ్వు అదృశ్యమైంది. అదే విధమైన రియాక్షన్ యుజవేంద్ర చాహల్ గర్ల్‌ఫ్రెండ్ మహవశ్ ది కూడా. ఆమె యూట్యూబర్ శుభంకర్ మిశ్రాతో స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తోంది. ఆమె పంజాబ్‌ను సపోర్ట్ చేస్తోంది. గతంలో కూడా ఆమె జట్టు మ్యాచ్ చూడటానికి వచ్చింది. అయితే చాలా మంది అభిమానులుఆమె బాధ‌లో ఉన్న‌ ఫోటోను వైరల్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఆమె శుభంకర్ మిశ్రాతో కలిసి మ్యాచ్ చూస్తోంది. మిశ్రా కూడా పంజాబ్ కింగ్స్‌ను సపోర్ట్ చేస్తున్నాడు. ఇద్దరూ మ్యాచ్ అంతా నిరాశలోనే కనిపించారు. అయితే కొన్ని సందర్భాల్లో వారికి కూడా సంతోషించే అవకాశం లభించింది.

నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీ

ఆర్‌సీబీ 102 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలో సాధించింది. విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ నాటౌట్‌గా 56 పరుగులు చేశాడు. ఈసారి ఆర్‌సీబీ అద్భుతంగా కనిపిస్తోంది. టైటిల్‌కు అడుగు దూరంలో ఉంది. అయితే, పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకోవడానికి ఇప్పుడు క్వాలిఫయర్-2 గెలవాలి. దీనిలో వారు ఎలిమినేటర్ విజేత జట్టుతో తలపడతారు. ఎలిమినేటర్ మ్యాచ్ ఈ రోజు గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ మధ్య ముల్లంపూర్ క్రికెట్ స్టేడియంలోనే జరుగుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2కి వెళ్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తుంది.