Yuzvendra Chahal: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. మాజీ భార్య ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన తర్వాత అతని పేరు ఆర్జే మహవష్‌తో వినిపిస్తోంది. వీరిద్దరూ పలు చోట్ల కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు జోరుగా సాగాయి. అయితే తాజాగా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీనితో వీరి బంధం తెగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో చాహల్ షేర్ చేసిన ఒక క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయన భగవద్గీతలోని ఒక వాక్యాన్ని పంచుకున్నారు.
నిజానికి ఆర్జే మహవష్‌తో బ్రేకప్ వార్తలు వస్తున్న తరుణంలో చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక మాటను ఆయన షేర్ చేస్తూ.. ‘విషయం ఎప్పుడూ సమయం గురించి ఉండదు. ప్రాధాన్యత గురించి ఉంటుంది. ఒకరు మీకు ప్రాధాన్యత అయితే మీరు వారి కోసం ఖచ్చితంగా సమయాన్ని వెతుక్కుంటారు’ అని రాశారు. ఈ పోస్ట్ ద్వారా ఆయన మహవష్‌పై పరోక్షంగా సెటైర్ వేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
Also Read: కార్తీ ఫాన్స్ కు గుడ్ న్యూస్..ఓటీటీలోకి ‘అన్నగారు వస్తారు..ఎప్పటినుంచి అంటే !
షెఫాలీ బగ్గాతో కనిపించిన యుజ్వేంద్ర చాహల్
గత కొద్దిరోజుల క్రితం యుజ్వేంద్ర చాహల్ యాంకర్, ‘బిగ్ బాస్’ మాజీ కంటెస్టెంట్ షెఫాలీ బగ్గాతో కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు బయటకు రావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందనే చర్చ మొదలైంది. మహవష్‌ను అన్‌ఫాలో చేసిన తర్వాత చాహల్, షెఫాలీకి దగ్గరయ్యారని భావిస్తున్నారు. అయితే ఈ పుకార్లపై అటు చాహల్ కానీ, ఇటు షెఫాలీ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
5 ఏళ్లు కూడా నిలవని యుజ్వేంద్ర – ధనశ్రీ బంధం
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మల బంధం విషయానికి వస్తే వీరిద్దరి ప్రేమ కరోనా సమయంలో మొదలైంది. ఈ జంట 2020లో వివాహం చేసుకున్నారు. అయితే నివేదికల ప్రకారం.. వివాహం జరిగిన రెండు ఏళ్లకే అంటే 2022లోనే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, అప్పటి నుండే విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. వీరి సంబంధం గురించి వస్తున్న పుకార్లు 2024 చివరలో మరింత ఎక్కువయ్యాయి. చివరికి 2025 మార్చిలో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
