Yuzvendra Chahal: శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు మరికాసేపట్లో ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో తలపడనుంది. ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు అద్వితీయమైన ఆటను ప్రదర్శించారు. వీరిలో జట్టు అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ (Yuzvendra Chahal) పేరు కూడా ఉంది.
చాహల్‌కు చరిత్ర సృష్టించే సువర్ణావకాశం
చాహల్ లీగ్ దశ చివరి రెండు మ్యాచ్‌లలో వేలు గాయం కారణంగా ఆడలేదు. కానీ ఇప్పుడు అతను తిరిగి రావడానికి పూర్తి అవకాశం ఉంది. ఆర్‌సీబీతో జరిగే ఈ పెద్ద మ్యాచ్‌లో చాహల్ ఆడటం పంజాబ్ కింగ్స్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. చాహల్ జట్టును గెలిపించడంలో సహాయపడడమే కాకుండా ఒక ప్రత్యేక రికార్డును సృష్టించే అవకాశం కూడా అతనికి ఉంది.
Also Read: New TVS Jupiter: టీవీఎస్ జూపిటర్ 125.. ఈసారి సరికొత్తగా!
ఒకవేళ ఈ మ్యాచ్‌లో చాహల్ మూడు వికెట్లు తీస్తే భారతదేశంలో అత్యధిక T20 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో పీయూష్ చావ్లా మొదటి స్థానంలో ఉన్నాడు. అతని పేరిట 289 వికెట్లు ఉన్నాయి. చాహల్ ఇప్పటివరకు భారతదేశంలో ఆడిన 254 T20 మ్యాచ్‌లలో 287 వికెట్లు తీశాడు. ఈ లెక్కల ప్రకారం.. చావ్లాను అధిగమించడానికి చాహల్‌కు కేవలం మూడు వికెట్లు మాత్రమే అవసరం.
యుజవేంద్ర చాహల్ T20 క్రికెట్‌లో టీమిండియా అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరిగా నిలుస్తాడు. అతని అనుభవం, మ్యాచ్ ఒత్తిడిలో శాంతంగా ఉంటూ వికెట్లు తీసే సామర్థ్యం చాహల్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. అందువల్ల క్వాలిఫయర్ వంటి కీలకమైన మ్యాచ్‌లో అతని తిరిగి రాకడం పంజాబ్ కింగ్స్‌కు ఊరట కలిగించే విషయం మాత్రమే కాదు.. చాహల్‌కు చరిత్ర సృష్టించే అవకాశం కూడా. పంజాబ్ కింగ్స్ అభిమానులు కూడా చాహల్‌పై ఆశలు పెట్టుకున్నారు. అతను ఫామ్‌లో ఉంటే రికార్డు సృష్టించడం ఖాయం.