Abhishek Sharma యువరాజ్ సింగ్ నెలకొల్పిన 12 బంతుల ఫిఫ్టీ రికార్డును బద్దలు కొట్టడం ఎవరికైనా దాదాపు అసాధ్యం.. కానీ, క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. ఎవరైనా ఆ రికార్డును తిరగరాయొచ్చు.. న్యూజిలాండ్‌పై వీరవిహారం చేసిన అనంతరం టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అన్న మాటలివి. తన గురువు యువరాజ్ సింగ్ రికార్డు పట్ల గౌరవం ప్రకటిస్తూనే, తానూ ఆ రేసులో ఉన్నాననే సంకేతాన్ని అభిషేక్ పరోక్షంగా ఇచ్చాడు.
- యువరాజ్ సింగ్ 12 బంతుల రికార్డు పదిలం
- 14 బంతుల్లోనే ఫిఫ్టీ బాది హార్దిక్ రికార్డును చెరిపివేసిన అభిషేక్ శర్మ
- తన ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ రేసులో స్థానాన్ని పదిలం చేసుకున్న యువ ఆటగాడు
మైదానంలో తన వినూత్న ఫుట్‌వర్క్ వెనుక ఉన్న రహస్యాన్ని కూడా అభిషేక్ బయటపెట్టాడు. “ఫీల్డర్లు ఎక్కడ ఉన్నారో గమనించి, దానికి తగ్గట్టుగా రూమ్ క్రియేట్ చేసుకుని ఆడతాను. బౌలర్ నా వికెట్ తీయాలని ఏ బంతి వేస్తాడో ముందే ఊహించి స్పందిస్తాను” అని తన గేమ్ ప్లాన్‌ను వివరించాడు. 154 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్, అభిషేక్ మెరుపులతో పవర్‌ప్లేలోనే 94 పరుగులు పిండుకుని విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ విజయంతో న్యూజిలాండ్‌పై సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా, రాబోయే ప్రపంచకప్‌కు ఒక ‘పవర్‌ఫుల్’ ఓపెనర్ దొరికాడనే భరోసాను పొందింది. కేవలం హిట్టర్‌గానే కాకుండా, పరిస్థితులకు తగ్గట్టుగా గేర్ మార్చే అభిషేక్ శైలి ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
