Site icon HashtagU Telugu

Shubman Gill: గిల్ కు యువరాజ్ సింగ్ బాసట.. పాక్ మ్యాచ్ ఆడాలంటూ..!

ODI Team Captain

ODI Team Captain

Shubman Gill: భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల గిల్ కోలుకొని నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అటగాడు యువరాజ్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. క్లిష్ట పరిస్థితిలో యువరాజ్ సింగ్ అతనికి ఫోన్ చేసి మ్యాచ్ ఆడమని అడిగాడు. తాను శుభ్‌మన్ గిల్‌కి ఫోన్ చేసి పాకిస్థాన్‌తో ఆడాలని కోరినట్లు యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కెరీర్‌లో రెండుసార్లు డెంగ్యూ సోకినప్పటికీ తాను ఆడానని యువీ గిల్‌తో చెప్పాడు. దీని తర్వాత గిల్ గురువారం అహ్మదాబాద్‌లో గంటపాటు ప్రాక్టీస్ చేశాడు. దీంతో గిల్‌ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ చాలా ముఖ్యమైనదని.. ఈ మ్యాచ్‌ ఆడాలని యువీ గిల్‌తో చెప్పాడు. యువీ మాట్లాడుతూ.. “నేను అతనికి ఫోన్ చేసి.. ‘నేను డెంగ్యూతో రెండుసార్లు ఆడాను, ప్రపంచకప్‌లో కూడా నాకు బాగాలేదు. కాబట్టి నిలబడి ఆడండి.. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. కానీ వైరల్ లేదా డెంగ్యూ నుండి కోలుకోవడం నిజంగా కష్టం. అవి శరీరం నుండి ప్రతిదీ పీల్చుకుంటాయి. గిల్‌ ఆ మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని నేను భావిస్తున్నానని అన్నాడు. ఈ నేపథ్యంలో యూవీ కామెంట్స్ తో గిల్ పాక్ మ్యాచ్ అడవచ్చుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: CM KCR: మంత్రి వేముల తల్లి మంజులమ్మ భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళి