Site icon HashtagU Telugu

Yuvraj Singh Birthday : రికార్డుల రారాజు యువ‘రాజ్’‌కు హ్యాపీ బర్త్‌డే.. కెరీర్ విశేషాలివీ

Yuvraj Singh Birthday 2024

Yuvraj Singh Birthday : యువరాజ్ సింగ్..  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన 2007 సంవత్సరంలో టీ-20 మ్యాచ్‌లో ఏకంగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి యావత్ ప్రపంచం చూపును తన వైపునకు తిప్పుకున్నారు. ఇవాళ యూవీ బర్త్‌డే. ఆయన 1981 సంవత్సరం డిసెంబర్ 12న చండీగఢ్‌లో జన్మించారు. యువరాజ్ 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆయన కెరీర్‌తో ముడిపడిన కొన్ని ఆసక్తికర, స్ఫూర్తిదాయక విశేషాలను తెలుసుకుందాం..

Also Read :Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం

Also Read :Ilayaraja Biopic : ఆ బయోపిక్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?

  • 2011 వరల్డ్‌కప్ అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడిన యూవీ.. అమెరికాలో చికిత్స తీసుకుని దాని ముప్పు నుంచి బయటపడ్డారు.
  • యూవీ 2012లో చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడారు.
  • 2017లో యూవీ ఆఖరి వన్డే, టీ20 ఆడారు.
  • యువరాజ్‌ సింగ్‌  2019 జూన్‌ 10న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
  • అప్పటి నుంచి క్రికెట్ కామెంట్రీ చేస్తూ యూవీ సందడి చేస్తున్నాడు.
  •  యూవీ జీవితం యువ ఆటగాళ్లకు ఒక స్ఫూర్తి.
  • 19 ఏళ్ల కెరీర్‌లో యూవీ 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడారు.