Site icon HashtagU Telugu

Yuvi: యువీ ఫీట్ కు 15 ఏళ్లు…కొడుకుతో కలిసి సెలబ్రేషన్

Yuvi Imresizer

Yuvi Imresizer

వరల్డ్ క్రికెట్ లో డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఫీట్ గుర్తుకొస్తుంది. 2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా అప్పట్లో ఘనత సాధించాడు. అదే మ్యాచ్‌లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేయడం క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌కైనా ఆల్‌టైమ్ రికార్డ్ గా నమోదయింది. యువీ ఈ ఫీట్ సాధించి ఇవాల్టికి 15 యేళ్లు పూర్తయింది. ఈ మెమరీనీ యువరాజ్ తన కుమారుడితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఆ 6 సిక్సర్ల వీడియోని తన కొడుకు ఓరియన్‌ కీచ్ సింగ్‌తో కలిసి చూస్తున్న వీడియోని తాజాగా యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 15 ఏళ్ల తర్వాత ఈ వీడియోని కలిసి చూసేందుకు ఇంతకంటే బెటర్‌ పార్టనర్ నాకు దొరకలేదని యువీ కాప్షన్ రాశాడు.కాగా
క్రికెట్‌లో అప్పటి వరకూ ముగ్గురు మాత్రమే ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టారు. గారీ సోబర్స్, రవిశాస్త్రి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్‌లో గిబ్స్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా యువరాజ్ సింగ్ ఈరోజుకీ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే యువీ ప్రస్తుతం లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నాడు.

Exit mobile version