Site icon HashtagU Telugu

TMC MP Yusuf Pathan: యూసుఫ్ పఠాన్‌కు నోటీసులు

TMC MP Yusuf Pathan

TMC MP Yusuf Pathan

TMC MP Yusuf Pathan: గుజరాత్‌లోని బిజెపి పాలిత వడోదర మున్సిపల్ కార్పొరేషన్ భారత మాజీ క్రికెటర్ మరియు టిఎంసి ఎంపి యూసఫ్ పఠాన్‌కు నోటీసులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ తమదేనని పేర్కొంటున్న భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై యూసుఫ్‌కు నోటీసు పంపారు. జూన్ 6న పఠాన్‌కు నోటీసు పంపించారు. అయితే బీజేపీ మాజీ కౌన్సిలర్ విజయ్ పవార్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో విఎంసి స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ శీతల్ మిస్త్రీ మీడియాకు వివరణ ఇచ్చారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కాగా యూసఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ నియోజకవర్గం నుండి టిఎంసి టిక్కెట్‌పై విజయం సాధించారు.

2012లో పఠాన్‌కు భూమిని విక్రయించాలన్న వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని, అయితే కొత్తగా ఎన్నికైన ఎంపీ పఠాన్ కాంపౌండ్ వాల్ నిర్మించి భూమిని ఆక్రమించారని విజయ్ పవార్ ఆరోపించారు. వాస్తవానికి నిర్మాణంలో పఠాన్ ఇల్లు ఈ భూమికి ఆనుకుని ఉన్నందున 2012లో పఠాన్ ఈ భూమిని వీఎంసీకి నుంచి కొనుగోలు చేశాడు. అతను చదరపు మీటరుకు దాదాపు రూ.57,000 ఇచ్చాడు. అప్పట్లో వీఎంసీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి సాధారణ బోర్డు సమావేశంలో ఆమోదించారు. అయితే ఇలాంటి విషయాల్లో తుది అధికారిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు.

Also Read: New Zealand Knocked Out: టీ20 ప్రపంచకప్‌ నుంచి న్యూజిలాండ్ ఔట్.. 1987 తర్వాత మళ్ళీ ఇప్పుడే..!