Uppal Stadium : ఉప్పల్ క్రికెట్ స్టేడియం ను ముట్టడిస్తామంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్చరిక

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నదని , అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్ కు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 12:05 PM IST

మరికాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో SRH vs RCB మ్యాచ్ జరగనున్న క్రమంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం (Uppal Stadium) ను ముట్టడిస్తామంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు (President of Youth Congress) హెచ్చరించడం సర్వత్రా చర్చగా మారింది.ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలకు నిరసనగా స్టేడియంను ముట్టడిస్తామని శివసేనా రెడ్డి తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) టికెట్స్ (IPL Tickets) ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నదని , అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్ కు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

యూత్ కాంగ్రెస్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్డేడియం వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. ఎటువంటి సంఘటన చోటుచేసుకోకుండా భారీగా పహారా కాస్తున్నారు. అడుగడుగున పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మరోపక్క క్రికెట్ అభిమానులు స్టేడియం కు చేరుకుంటున్నారు.

ఇదిలా ఉంటె ఈరోజు మ్యాచ్ సందర్బంగా నగరంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. బోడుప్పల్‌, చెంగిచర్ల, ఉప్పల్‌ వైపు నుంచి భాగయత్ లే అవుట్‌ నుంచి నాగోల్‌ వైపు వచ్చే వాహనాలు, హెచ్‌ఎండీఏ లేఔట్‌ నుంచి బోడుప్పల్‌, చెంగిచర్ల ఎక్స్‌ రోడ్డు వైపు ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు. తార్నాక వైపు నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు తార్నాక వైపు నుంచి రాక, బయలు దేరి వెళ్లాలని సూచించారు. అలాగే మ్యాచ్ సందర్బంగా ఉప్పల్ వైపు నడిచే మెట్రో ట్రైన్స్ సమయం కూడా పొడిగించారు. రాత్రి ఒంటి గంట కు లాస్ట్ ట్రైన్ అని తెలిపింది మెట్రో. అలాగే ఆర్టీసీ సైతం అదనపు సర్వీస్ లు నడుపుతుంది.

Read Also : YS Viveka Wife Sowbhagyamma : జగన్ కు వరుస ప్రశ్నలు సంధిస్తూ నిలదీసిన వివేకా భార్య సౌభాగ్యమ్మ

Follow us