Site icon HashtagU Telugu

Michael Clarke: మైఖేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు.. IPL కోసం ఆడతావు.. దేశం కోసం ఆడలేవా..?

628659 Michael Clarke Pti

628659 Michael Clarke Pti

T20 ప్రపంచకప్ గెలిచి విజయోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు త్వరలో వన్డేల కోసం ఆసీస్‌లో పర్యటించనుంది. తక్కువ విరామంతో మ్యాచులు ఆడటం కష్టమని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఆవేదన వ్యక్తంచేశాడు. అలీ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్‌ క్లార్క్‌ స్పందించాడు. IPL కోసం ఉత్సాహంగా బయలుదేరతారు కానీ దేశం కోసం ఆడలేరా? అంటూ ప్రశ్నించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి ఫిర్యాదులకు ముగింపు పలకాలన్నాడు.

ఆస్ట్రేలియా 2015 వన్డే ప్రపంచకప్ విజేత కెప్టెన్ మైఖేల్ క్లార్క్.. అంతర్జాతీయ షెడ్యూల్‌పై చేసిన ఫిర్యాదులపై ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను తీవ్రంగా విమర్శించారు. టీ20 ప్రపంచకప్ విజయం సాధించిన మూడు రోజుల తర్వాత నవంబర్ 17 నుండి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ మూడు వన్డేలు ఆడనుంది. ప్రపంచకప్‌ గెలిచిన వెంటనే ద్వైపాక్షిక సిరీస్‌ ఆడడం సిగ్గుచేటని రషీద్‌ అన్నాడు. ఇంగ్లండ్ సెమీఫైనల్ విజయంలో కీలకపాత్ర పోషించిన లెగ్ స్పిన్నర్ పైవిధంగా కామెంట్స్ చేశాడు. అలీ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్‌ క్లార్క్‌ స్పందించాడు. IPL కోసం ఉత్సాహంగా బయలుదేరే మీరు దేశం కోసం ఆడలేరా? అంటూ విమర్శించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి ఫిర్యాదులు చేయటం తగ్గించాలని అన్నాడు.

T20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాక్‌పై అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లండ్ విజయంలో స్పిన్నర్ అదిల్‌ రషీద్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇటీవల అదిల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి IPL వేలంలో నా పేరును ఉంచేందుకు తప్పకుండా ప్రయత్నిస్తా’’ అని రషీద్‌ చెప్పిన విషయం తెలిసిందే. 2023 ఎడిషన్‌కు ముందు మినీ వేలం డిసెంబర్‌ 23న జరగనుంది. అనుభవజ్ఞులైన ఇంగ్లండ్ లెగ్గీలు తమ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని చూస్తున్న ఐపీఎల్ జట్లకు హాట్ పిక్‌గా మారవచ్చు.