2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

లిస్ట్‌లో 10వ స్థానంలో ఉన్న విఘ్నేష్ తన వెరైటీ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ ద్వారా వైరల్ అయ్యారు. ఐపీఎల్ అరంగేట్రంలోనే 'మిస్టరీ స్పిన్నర్‌'గా గుర్తింపు పొంది సెర్చ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు.

Published By: HashtagU Telugu Desk
Rohit Sharma- Virat Kohli

Rohit Sharma- Virat Kohli

Year Ender 2025: ప్రతి సంవత్సరం చివరలో గూగుల్ తన ‘ఇయర్ ఇన్ సెర్చ్’ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. గత 12 నెలల్లో ఈ సెర్చ్ ఇంజిన్‌లో ప్రజలు ఎవరి గురించి ఎక్కువగా వెతికారో ఇందులో వివరిస్తారు. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి ఒక షాకింగ్ విషయం ఏమిటంటే.. గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్ల జాబితాలో ‘Ro-Ko’ (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) ఇద్దరి పేర్లు లేవు.

2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే

వైభవ్ సూర్యవంశీ: ఐపీఎల్ 2025 సమయంలోనే వైభవ్ వార్తల్లో నిలిచారు. టీ-20 చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందారు. ఇటీవల అండర్-19 ఆసియా కప్‌లో 171 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. మొత్తంగా ఈ ఏడాది అత్యధికంగా వెతకబడిన భారతీయ వ్యక్తిగా నిలవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో ఆయన రోహిత్, విరాట్‌లను వెనక్కి నెట్టారు.

ప్రియాంశ్ ఆర్య: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అత్యధికంగా సెర్చ్ చేయబడిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు.

అభిషేక్ శర్మ: టీమ్ ఇండియాలో విధ్వంసకర ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా ఎదగడమే కాకుండా, పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఆటగాడిగా నిలిచారు. ఈ ఏడాది భారత్‌కు పలు విజయాలు అందించారు.

షేక్ రషీద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ యువ ప్రతిభావంతుడు ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఆయన సాగించిన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. అందుకే ఆయన సెర్చ్ లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచారు.

Also Read: MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

జెమిమా రోడ్రిగ్స్: మహిళల ప్రపంచకప్ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీ చేసి భారత్‌ను గెలిపించారు. భారత మహిళల జట్టు మొదటిసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అందుకే అభిమానులు ఆమె గురించి ఎక్కువగా వెతికారు.

ఆయుష్ మ్హ‌త్రే: ముంబై దేశీవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన 18 ఏళ్ల ఆయుష్, 2025 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే అవకాశం దక్కించుకున్నారు. అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించి తన ప్రతిభను చాటుకున్నారు.

స్మృతి మంధాన: భారత స్టార్ క్రికెటర్ స్మృతి ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు. ఏడాది పొడవునా రికార్డు స్థాయి బ్యాటింగ్‌తో పాటు, ఆమె నిశ్చితార్థం, పెళ్లి ఆగిపోయిందనే వార్తల కారణంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించబడ్డారు.

కరుణ్ నాయర్: భారత్ తరపున గతంలో ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ 2025 రంజీ, విజయ్ హజారే ట్రోఫీల్లో వరుస సెంచరీలు బాదారు. భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడంతో ఆయన గురించి గూగుల్‌లో సెర్చ్ పెరిగింది.

ఉర్విల్ పటేల్: 360 డిగ్రీల హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న ఉర్విల్ దేశీవాళీ టీ-20ల్లో తన ఫినిషింగ్ సామర్థ్యంతో మెరిశారు. అభిమానులు ఆయనను దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పోల్చడం విశేషం.

విఘ్నేష్ పుత్తూరు: లిస్ట్‌లో 10వ స్థానంలో ఉన్న విఘ్నేష్ తన వెరైటీ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ ద్వారా వైరల్ అయ్యారు. ఐపీఎల్ అరంగేట్రంలోనే ‘మిస్టరీ స్పిన్నర్‌’గా గుర్తింపు పొంది సెర్చ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు.

  Last Updated: 19 Dec 2025, 02:21 PM IST