Site icon HashtagU Telugu

Yashasvi: యశస్వి జైస్వాల్ అరంగేట్రం.. తొలి టెస్టుకు భారత తుది జట్టు ఇదే..!

yashasvi jaiswal

Resizeimagesize (1280 X 720) (2) 11zon

Yashasvi: దాదాపు నెలన్నర రోజుల విరామం తర్వాత టీమిండియా మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది. విండీస్ పర్యటనతో కొత్త సీజన్ ను స్టార్ట్ చేస్తోంది. సీనియర్, యువ ఆటగాళ్ల కూర్పుతో తొలి టెస్టుకు సిద్ధమయింది. ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టులో తుది జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ (Yashasvi) తన టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు. తొలి టెస్టులో యశస్వి ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న యశస్వికి మ్యాచ్ లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు విండీస్ పై అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెడుతున్నాడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో సెంచరీలతోపాటు ఐపీఎల్ 2023లోనూ యశస్వి రాణించాడు. ఈ సీజన్ లో అతడు 625 రన్స్ చేసాడు.

రోహిత్, యశస్వి ఓపెనర్లుగా రానుండగా.. శుభ్‌మన్ గిల్ మూడోస్థానంలో ఆడతాడు. సీనియర్ బ్యాటర్ పుజారాను ఈ సిరీస్ కు ఎంపిక చేయకపోవడంతో అతని స్థానంలో గిల్ బ్యాటింగ్ కు రానున్నాడు. ఈ సిరీస్ కోసం రుతురాజ్ గైక్వాడ్ ను కూడా ఎంపిక చేసినా.. అతని కంటే ముందే యశస్వి టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్‌గా భరత్‌నే ఆడించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్న కారణంగా వికెట్ల వెనుక మంచి స్కిల్స్ ఉన్న కీపర్ అవసరం. ఈ విషయంలో కిషన్ కన్నా భరత్ ఒక మెట్టు పైన ఉన్నాడు.

Also Read: Asia Cup 2023: ఆసియా కప్‌లో ఎలాంటి మార్పు లేదు.. శ్రీలంకలో భారత్-పాక్ మ్యాచ్..!

కాగా వెస్టిండీస్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ భారత పేస్ ఎటాక్ ను లీడ్ చేయనున్నాడు. ప్రస్తుతం ఉన్న జట్టులో 19 టెస్టులతో సిరాజ్ సీనియర్ పేస్ బౌలర్. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్ , జైదేవ్ ఉనద్కట్ , నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్ ఎంపికయ్యారు. సీనియర్ పేసర్ బుమ్రా గాయపడగా.. షమి, ఉమేష్ లాంటి వాళ్లకు విశ్రాంతినిచ్చారు. జయదేవ్ ఉనద్కత్‌ను కూడా ఆడించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.దీంతో చివరి స్థానం కోసం ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ నెలకొంది.

తొలి టెస్టులో భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.