Yashasvi Jaiswal: భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వచ్చే సీజన్‌లో గోవా తరపున దేశీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని గోవా కెప్టెన్‌గా కూడా నియమించే అవకాశం ఉంది. 23 ఏళ్ల ఈ భారత ఓపెనర్ యశస్వి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి నో-ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోరాడు. MCA అధికారి ఒకరు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. అవును అతని (జైస్వాల్) ఈ నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉంది. కానీ అతను ఏదో ఆలోచించి ఉంటాడు. అతను తనను విడుదల చేయాలని కోరాడు. MCA జైస్వాల్ డిమాండ్‌ను అంగీకరించింది అని వివరించాడు.
జైస్వాల్ ముంబై తరపున చివరి మ్యాచ్ జనవరి 23 నుంచి 25 వరకు రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కాశ్మీర్‌తో ఆడాడు. ఆ మ్యాచ్‌లో జైస్వాల్ 4, 26 పరుగులు చేశాడు. గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శాంభ దేశాయ్ మాట్లాడుతూ.. అతను మా కోసం ఆడాలని కోరుకుంటున్నాడు. మేము అతన్ని స్వాగతిస్తున్నాము. జైస్వాల్‌ను కెప్టెన్‌గా నియమించే అంశంపై దేశాయ్ స్పందించారు. అవును, అది జరగొచ్చు. అతను భారత జట్టు కోసం ఆడుతున్నాడు. అతను జాతీయ విధుల్లో లేనప్పుడు.. దేశీయ క్రికెట్‌కు అందుబాటులో ఉన్నప్పుడు అతన్ని కెప్టెన్‌గా నియమిస్తారు అని తెలిపారు.
Also Read: Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?
ముంబైని వదిలి గోవాకు వెళ్లే మూడో ఆటగాడు జైస్వాల్
యశస్వి జైస్వాల్ ముంబైని వదిలి గోవా తరపున ఆడే మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అతనికి ముందు అర్జున్ టెండూల్కర్, సిద్ధార్థ్ లాడ్ గోవా తరపున ఆడారు. టెండూల్కర్, లాడ్ 2022-23 సీజన్‌లో గోవా తరపున ఆడారు. ఆ తర్వాత సిద్ధార్థ్ ముంబైకి తిరిగి వచ్చాడు. అతను కూలింగ్ పీరియడ్‌లో కూడా ఉన్నాడు.
భారత్ కోసం 19 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్
యశస్వి జైస్వాల్ జులై 2023లో వెస్టిండీస్‌తో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఓపెనర్‌గా మొదటి ఎంపికగా కొనసాగుతున్నాడు. జైస్వాల్ అరంగేట్రం తర్వాత భారత్ కోసం 19 మ్యాచ్‌లు ఆడాడు. పెద్ద వేదికపై అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని సగటు 52 కంటే ఎక్కువగా ఉంది. ఈ ఫార్మాట్‌లో భారత్ కోసం ఆడుతూ నాలుగు శతకాలు, 10 అర్ధ శతకాలు సాధించాడు.