WI vs IND: విదేశీ పిచ్ పై ‘ఒక్క మగాడు’

అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కిన జైస్వాల్ తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. తొలి టెస్టులోనే ఒక యువ ఆటగాడు సెంచరీ సాధించడం

WI vs IND: అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కిన జైస్వాల్ తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. తొలి టెస్టులోనే ఒక యువ ఆటగాడు సెంచరీ సాధించడం, దాన్ని డబుల్ సెంచరీగా మలిచే దిశగా తీసుకెళ్లడం చిన్న విషయమేమీ కాదు. ప్రస్తుతం వెస్టిండీస్ బౌలింగ్‌లో అరివీర భయంకర బౌలర్లు ఉండకపోవచ్చు. కానీ తొలి టెస్టులోనే 21 ఏళ్ళ ఓ యువ ఆటగాడు సెంచరీ సాధించడం అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అరంగేట్ర టెస్టులో విదేశీ గడ్డపై 150 ప్లస్ స్కోర్ చేసిన తొలి ఇండియన్ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు జైస్వాల్. విండీస్ తో జరుగుతున్నటెస్ట్ సిరీస్ లో ఈ ఫీట్ సాధించాడు.

నిజానికి టీమిండియా తరఫున అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. 2013లో ధావన్.. ఆస్ట్రేలియాతో తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ధావన్ 187 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ టీమిండియా తరఫున డెబ్యూ మ్యాచ్ లో హయ్యస్ట్ స్కోరు ధవన్ పేరిటే ఉంది. ఆ తరువాత స్థానాల్లో హిట్ మ్యాన్ కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 2017లో తన మొదటి టెస్టులో 177 పరుగులు చేశాడు. రోహిత్ వెస్టిండీస్‌పై ఈ ఫీట్ సాధించాడు. అయితే ధావన్, రోహిత్ స్వదేశీ గడ్డపై మాత్రమే ఈ పరుగులు చేశారు. కానీ విదేశీ గడ్డపై 150 ప్లస్ స్కోర్ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ రికార్డ్ జైస్వాల్ పేరిట నమోదైంది.

Read More: CLP Leader Bhatti : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి – సీఎల్పీ నేత భ‌ట్టి