Site icon HashtagU Telugu

Ind vs Aus T20: రుతురాజ్ కు సారీ చెప్పిన యశస్వి జైస్వాల్

India vs Australia

Ind vs Aus T20

Ind vs Aus T20: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. నిన్న తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అతను ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కుర్రాళ్ళు అదరగొడుతున్నారు. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి సత్తాచాటారు. తొలి మ్యాచ్ లో భారీ టార్గెట్ ను ఛేదించిన టీమిండియా రెండో మ్యాచ్ లో భారీ టార్గెట్ ఇచ్చి ఆసీస్ ను చిత్తూ చేసింది. అంతేకాదు బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తుండటంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. అయితే తొలి టీ20లో రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ పై యశస్వి జైస్వాల్ ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా యశస్వి స్పందించాడు. ఆ రనౌట్‍ విషయంలో తప్పు తనదేనని, రుతురాజ్ గైక్వాడ్‍కు సారీ కూడా చెప్పానని, దానికి గైక్వాడ్ తన పొరపాటును అంగీకరించాడని యశస్వి చెప్పాడు. ఆటలో ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయని గైక్వాడ్ చెప్పినట్లు జైస్వాల్ అన్నాడు. మరి ఇప్పటికైనా నెటిజన్స్ యశస్వినీ ట్రోల్ చేయడం ఆపితే బాగుంటుంది.

Also Read: Visa Free Entry : డిసెంబరు 1 నుంచి వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లిపోవచ్చు