Under19WorldCup: చెప్పిమ‌రీ చిత‌క్కొట్టిన య‌ష్..!

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 05:06 PM IST

అండ‌ర్‌-19 ప్ర‌పంచకప్‌ టోర్నీలో యువ భార‌త్ ఫైనల్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. కుర్రాళ్ళ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన యంగ్ టీమ్ ఇండియా, అంచ‌నాల‌కు అనుగుణంగా ప్ర‌తి మ్యాచ్‌లో ప్రత్య‌ర్ధుల‌ను చిత్తు చేస్తూ వ‌రుస‌గా నాలుగోసారి ఫైన‌ల్‌కు చేరింది. బుధ‌వారం రాత్రి ఆంటిగ్వా వేదికగా బ‌ల‌మైన‌ ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ సెమీఫైనల్లో 96 ప‌రుగుల తేడాతో యంగ్ ఇండియా విజ‌య‌భేరి మోగించింది. దీంతో శ‌నివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో టీమ్ ఇండియా, ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియా విజ‌యం సాధించడంలో కెపెటెన్ య‌ష్ ధుల్ అండ్ వైస్ కెప్టెన్ షేక్ ర‌షీద్ కీల‌కపాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. షేక్ ర‌షీద్ తృటిలో చెంచ‌రీ చేసే అవ‌కాశం కోల్పోయినా, కీల‌క‌మైన 94 చేశాడు. మ‌రోవైపు 37 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయి, జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క్రీజ్‌లో పాతుకుపోయి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన య‌ష్ ధ‌ల్ 114 సెంచ‌రీతో చెల‌రేగి టీమ్ ఇండియాను గెలిపించ‌డ‌మే కాకుండా ఫైన‌ల్‌కు చేర్చ‌డంతో క్రికెట్ నిపుణుల‌తో పాటు అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు య‌ష్ ధుల్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్ల‌డిన య‌ష్‌, ఆస్ట్రేలిగా మంచి టీమ్ అయినా, వారి బౌలింగ్‌లో ప‌స లేద‌ని, దీంతో కుర్ర కంగారూల బౌల‌ర్లు, ధీటుగానే ఎదుర్కుంటామ‌ని య‌ష్ వ్యాఖ్య‌లు చేశాడు. య‌ష్ వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాదు, చెప్పిన‌ట్లుగానే ఆస్ట్రేలియా బౌలింగ్‌ను చిత‌క్కొట్టి శ‌త‌కం కొట్ట‌డంతో క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముందు కుర్రాడి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని అనుకున్నా, ఆ మ్యాచ్‌లో య‌ష్ ఆడిన తీరుపై క్రికెట్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక‌పోతే న్యూఢిల్లీకి చెందిన యశ్‌ దుల్‌కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా – ఎ జట్లకు నాయకత్వం వహించాడు. దేశ‌వాలి క్రికెట్‌లో భాగంగా ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో య‌ష్ ధుల్ ఒక‌డు. అలాగే డీడీసీఈ(ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్‌లు ఆడిన 302 పరుగులు చేసిన య‌ష్‌, ఆసియా అండర్‌–19 క్రికెట్‌ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించి, ఫైన‌ల్లో శ్రీలంక‌ను 9వికెక్ల తేడాతో ఓడించి యువ భార‌త‌ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే ఇప్పుడు ఐసీసీ వ‌రల్డ్‌క‌ప్‌లో కూడా టీమ్ ఇండియాను ఫైన‌ల్‌కు చేర్చి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకోవ‌డమే కాకుండా, బ్యాట్స్‌మ‌న్‌గా కూడా త‌న‌వంతు పాత్ర పోషిస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషించాడు. మ‌రి ఇదే ఊపులో ఫైన‌ల్లో ఇంగ్లాండ్ పై కూడా విజ‌యం సాధించి అండర్ 19 ప్ర‌పంచ క‌ప్‌ను సొంతం చేసుకోవాల‌ని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.