- టీమిండియాకు బిగ్ షాక్
- డబ్ల్యూటీసీ టేబుల్‌లో ఆరో స్థానానికి పడిపోయిన భారత్
- అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు
WTC Points Table: యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను 82 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లు నాలుగో ఇన్నింగ్స్‌లో గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఓటమిని తప్పించలేకపోయారు. ఈ వరుస విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
ఆస్ట్రేలియా ఆధిపత్యం.. నంబర్ వన్ స్థానం పదిలం
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ఇంగ్లండ్‌పై వరుసగా మూడో విజయం తర్వాత ఆస్ట్రేలియా 100 శాతం విజయాల రేటుతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Also Read: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!
ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ఇలా ఉంది.
- ఆస్ట్రేలియా: 100% (మొదటి స్థానం)
- సౌత్ ఆఫ్రికా: 75% (రెండో స్థానం)
- న్యూజిలాండ్: 66.67% (మూడో స్థానం)
- శ్రీలంక: నాలుగో స్థానం
- పాకిస్థాన్: ఐదో స్థానం
- భారతదేశం (టీమ్ ఇండియా): 48.15% (ఆరో స్థానం)
Australia continue their reign at the top of the #WTC27 standings following a stellar win in Adelaide 🏏
More from the latest #AUSvENG Test 👉 https://t.co/Zwi3UpkPtp pic.twitter.com/wSCgS7yQtb
— ICC (@ICC) December 21, 2025
కుదేలైన ఇంగ్లండ్
వరుసగా మూడో టెస్టులో ఓడిపోవడంతో ఇంగ్లండ్ పరిస్థితి దారుణంగా తయారైంది. జట్టు విజయాల శాతం కేవలం 27.08 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కేవలం బంగ్లాదేశ్, వెస్టిండీస్ కంటే మాత్రమే ముందుంది. ఈ ఓటములతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడం ఇంగ్లండ్‌కు ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారింది.
అడిలైడ్ టెస్ట్
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఇంగ్లండ్ జట్టు 352 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ చెరో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరోసారి యాషెస్ ట్రోఫీని తన వద్దే అట్టిపెట్టుకుంది.
