WTC ఫైనల్స్ రేస్…రెండో స్థానంలో భారత్

బంగ్లాదేశ్ టూర్ ను టీమిండియా ఘనంగా ముగించింది. వన్డే సిరీస్ కోల్పోయినా...టెస్ట్ సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

  • Written By:
  • Updated On - December 25, 2022 / 07:52 PM IST

బంగ్లాదేశ్ టూర్ ను టీమిండియా ఘనంగా ముగించింది. వన్డే సిరీస్ కోల్పోయినా…టెస్ట్ సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ రేసులో భారత్ ముందంజలో ఉంది. బంగ్లాపై సిరీస్ స్వీప్ తర్వాత పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 14 మ్యాచ్ లలో 8 విజయాలు, 4 ఓటములు, 2 డ్రాలతో 99 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ 13 మ్యాచ్ లలోనే 9 విజయాలు సాధించింది. ఒకవేళ బంగ్లాదేశ్ పై టీమిండియా రెండో టెస్టులో ఓడిపోయి ఉంటే సిరీస్ సమమయ్యేది.

అప్పుడు రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టమయ్యేవి. కొత్త ఏడాది భారత్ ఆసీస్ తో స్వదేశంలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే భారత్ ఆసీస్ పై సిరీస్ గెలవాల్సి ఉంటుంది. అయితే సౌతాఫ్రికా,ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ఫలితంతో భారత్ ఎంత తేడాతో సిరీస గెలిస్తే రేసులో ముందంజ వేస్తుందనేది తెలుస్తుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్ , ఇంగ్లాండ్ ఉన్నాయి. వీటిలో ఆసీస్ , భారత్ లకే ఎక్కువ అవకాశమున్నట్టు చెప్పొచ్చు. కాగా సొంతగడ్డపై భారత్, ఆసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి మొదలవుతుంది.