Wrestlers Harassment: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఒలింపియన్ రెజ్లర్ల మధ్య వివాదం మళ్లీ వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది

Wrestlers Harassment: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఒలింపియన్ రెజ్లర్ల మధ్య వివాదం మళ్లీ వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని ప్రఖ్యాత ఒలింపియన్ రెజ్లర్లు ఆదివారం సోనిపట్ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులపై మహిళ రెజర్లు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా కేసు నమోదు కాలేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. పోక్సో కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఫిర్యాదు చేసి మూడు నెలలు కావస్తున్నా మాకు న్యాయం జరగలేదని రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. అందుకే మళ్లీ నిరసన తెలియజేస్తున్నాం. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం, ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) మాకు మద్దతు ఇస్తున్నందుకు మేము కృతజ్ఞులం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని, నెలరోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు మూడు నెలలు గడిచినా విచారణ నివేదికను బహిర్గతం చేయలేదని రెజ్లర్లు తెలిపారు.

ఈ వివాదంపై ఓ మల్లయోధుడు మాట్లాడుతూ.. రెజ్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ అబద్ధమని తేలింది. మల్లయోధులను ప్రభుత్వం మోసం చేసింది. నెల రోజుల్లో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రభుత్వం విచారణ నివేదికను బహిర్గతం చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.

Read More: Trent Boult: ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన ట్రెంట్ బోల్ట్