Site icon HashtagU Telugu

Aman Sehrawat: భారత్‌కు ఆరో మెడల్.. రెజ్లర్ అమ‌న్ సెహ్రావ‌త్‌‌కు కాంస్యం

Wrestler Aman Sehrawat

Aman Sehrawat: అమ‌న్ సెహ్రావ‌త్ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటాడు. రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో ప్యూర్టోరికాకు చెందిన డారియ‌న్ క్ర‌జ్‌పై 13-5 తేడాతో విజయం సాధించాడు. దీంతో కాంస్య పతకం అమ‌న్ సొంతమైంది. దీంతో భార‌త్ ఖాతాలో ఆరో మెడ‌ల్‌ చేరింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచే ప్ర‌త్య‌ర్థిపై అమన్(Aman Sehrawat) ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాడు. ఫ‌స్ట్ హాఫ్‌లో ఆరు, సెకండ్ హాఫ్‌లో ఏడు పాయింట్లను అమన్ సాధించాడు. డారియ‌న్‌కు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా అమన్ ఆడాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చేసిన త‌ప్పులు ఈ మ్యాచ్‌లో రిపిట్ కాకుండా చూసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్‌లో అమ‌న్ దూకుడుకు డారియ‌న్ ఏమీ చేయలేక  చతికిలపడ్డాడు. దీంతో భార‌త్ త‌ర‌ఫున ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన అతి పిన్న వ‌య‌స్కుడిగా అమ‌న్ రికార్డును నెలకొల్పాడు.

We’re now on WhatsApp. Click to Join

21 ఏళ్ల 24 రోజుల వయసులో అమ‌న్ మన దేశం కోసం కాంస్య పతకాన్ని గెలిచాడు. అంతకుముందు 21 ఏళ్ల 44 రోజుల వయసులో మన దేశానికి పీవీ సింధు ఒలింపిక్ మెడల్ సాధించారు. 22 ఏళ్ల వ‌య‌సులో విజేంద‌ర్ సింగ్ బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టారు. వారందరి రికార్డును ఇప్పుడు అమన్ అధిగమించాడు.  ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో మన దేశానికి వచ్చిన మొదటి మెడల్ ఇది. అంతకుముందు గురువారం రోజు జావెలిన్ త్రోలో నీర‌జ్‌కు సిల్వ‌ర్ మెడ‌ల్‌ వచ్చింది. ఇక హాకీ టీమ్‌కు కాంస్య ప‌త‌కం వచ్చింది.  పతకం సాధించిన నేపథ్యంలో అమన్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అమ‌న్ విజ‌యాన్ని యావత్ భారత్ సెల‌బ్రేట్ చేసుకుంటోందన్నారు.

Also Read :Male Breast Cancer: మ‌హిళ‌ల‌కే కాదు పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్స‌ర్..!

ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు వచ్చిన ఏడో ప‌త‌కం ఇది. గ‌తంలో సుశీల్ కుమార్ రెండు మెడ‌ల్స్ గెలిచారు. ర‌వికుమార్‌, సాక్షి మాలిక్‌, యోగేశ్వ‌ర్ ద‌త్‌, భ‌జ‌రంగ్ పూనియా కూడా ఒలింపిక్ మెడ‌ల్స్‌ను మన దేశానికి అందించారు. వినేష్ ఫోగాట్ కూడా ఈ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరారు. అయితే ఆమె బ‌రువు ఎక్కువ‌గా ఉందని తేలడంతో ఫైనల్ మ్యాచ్ ఆడకుండా అనర్హత వేటు వేశారు. ఒలింపిక్స్ మెడల్స్ లిస్టులో ఒక సిల్వ‌ర్‌, ఐదు కాంస్యాల‌తో 69వ స్థానంలో భార‌త్ ఉంది. 111 ప‌త‌కాల‌తో అమెరికా టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. 83 మెడ‌ల్స్‌తో చైనా రెండో ప్లేసులో ఉంది.

Also Read :Anasuya : తీవ్ర గాయాలతో అనసూయ..ఆందోళనలో ఫ్యాన్స్