Site icon HashtagU Telugu

Jhulan Goswami: ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్​గా ఝులన్ గోస్వామి

Jhulan Goswami

Resizeimagesize (1280 X 720) 11zon

మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారత మాజీ క్రికెట్ వుమెన్ ఝలన్ గోస్వామి (Jhulan Goswami) మెంటార్​గా నియమితురాలైంది. ఈ విషయాన్ని ప్రాంచైజీ యాజమాన్యం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక జట్టు హెడ్​ కోచ్​గా చార్లెట్ ఎడ్వర్డ్స్​, బ్యాటింగ్ కోచ్​గా దేవిక పల్షికార్​, టీమ్ మేనేజర్​గా తృప్తి భట్టాచార్య నియమితులైనట్లు ముంబై ఇండియన్స్ తెలిపింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WIPL) కోసం ముంబై జట్టు తన కోచింగ్ సిబ్బంది పేర్లను ప్రకటించింది. భారత మాజీ క్రీడాకారిణి ఝులన్ గోస్వామికి కీలక బాధ్యతలు దక్కాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై జట్టు మెంటార్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా ఝులన్ గోస్వామి వ్యవహరించనున్నారు. కాగా చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ముంబై జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించింది. ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ కెప్టెన్‌గా ఉన్నారు. దీంతో పాటు భారత మాజీ క్రికెటర్ దేవికా పల్షికర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించారు.

ఇటీవల ఝులన్ గోస్వామి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ఇది కాకుండా.. ఈ వెటరన్ ప్లేయర్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. ఇప్పుడు ముంబై జట్టు తమ జట్టుకు మెంటార్, బౌలింగ్ కోచ్‌గా చేసింది. ఝులన్ గోస్వామి తన అంతర్జాతీయ కెరీర్‌లో 350కి పైగా వన్డే వికెట్లు తీసింది. మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణి. అదే సమయంలో గోస్వామి జనవరి 2016 నుండి రిటైర్మెంట్ వరకు ICC ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బౌలింగ్‌లో కొనసాగింది. ఝులన్ గోస్వామి బెంగాల్‌కు చెందినవారు.

Also Read: Supreme Court: సుప్రీం కోర్టు జడ్జీలుగా మరో ఐదుగురికి పదోన్నతి .. వారిలో ఓ తెలుగు జడ్జి..!

భారత జట్టులో ఝులన్ గోస్వామి సహచరురాలు మిథాలీ రాజ్‌ను గుజరాత్ జట్టుకు మెంటార్‌గా నియమించుకుంది. మిథాలీ అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే.. 211 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 7805 పరుగులు చేసింది. మిథాలీ 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు చేసింది. ఆమె 12 టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడింది. ఇందులో 699 పరుగులు చేసింది. మిథాలీ 89 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 2364 పరుగులు చేసింది. ఇందులో ఆమె 17 అర్ధ సెంచరీలు చేసింది. వన్డే ఫార్మాట్‌లోనూ మిథాలీ 8 వికెట్లు పడగొట్టింది.